Health Problems : వాతావరణం లోనే మార్పులు, విస్తృతంగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఎంతో మంది ఆ ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. వర్షాల కారణంగా ఎక్కడబడితే అక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల నీటిలో బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా ద్వారా ఎన్నో రోగాలు సంభవిస్తున్నాయి. అలాగే మురికిగుంటలో నిల్వ ఉండే నీరు వల్ల దోమల చేరి టైపాయిడ్ ,మలేరియా, డెంగు వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఇటువంటి జ్వరాలు వచ్చిన వారు ఆహారం విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇటువంటి ఆహారం తీసుకోకూడదు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. అనే విషయాలపై ఎన్నో అనుమానాలకి గురి అవుతున్నారు. ఇలాంటి జ్వరాలు వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తీసుకోకూడదని చెప్తుంటారు.
అయితే దీనిపై వైద్య నిపుణులు కొన్ని విషయాలను తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్య ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అయ్యి శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే చికెన్ ,గుడ్లు, చేపలు లాంటివి నాన్ వెజ్ ఆహారం తీసుకుంటే అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కావున కడుపులో ఆసిడిటీ ,అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల జ్వరం అధికమవుతుంది. ఇతర రోగాలు వస్తాయి అనేది వాస్తవం కాదని పేర్కొంటున్నారు. కావున జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తీసుకోవాలని అనిపిస్తే ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ రోగనిరోధక శక్తి అధికమవుతుంది.
Health Problems : అయితే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రోటీన్, కార్బోహైడ్రేట్ శరీరానికి ఎంతో అవసరం కాబట్టి వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కావున వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు రావని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొందరికి జ్వరం వస్తే వాంతులు విరోచనాలు లాంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చేపలు, చికెన్ లాంటివి వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉప్పు, కారం ,మసాలా వంటివి కూడా తక్కువగా తీసుకోవాలి. అయితే వికారం ,అజీర్తి లాంటి సమస్యలు కనపడితే మాత్రం కూరగాయల ఆహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారం వల్ల ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీనిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు విటమిన్లు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.