TOllywood : తెలుగు పరిశ్రమలో ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్స్ నే. వీరిద్దరికీ జనాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇద్దరు దర్శకులు తమ చివరి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్d అయింది. అలాగే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ డైరెక్టర్లు మహేష్ బాబుతో తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
రాజమౌళి ఎక్కువగా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అలాగే త్రివిక్రమ్ ఎక్కువగా పవన్, బన్నీ, మహేష్ తో సినిమాలు చేశారు. అయితే మధ్యలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటించారు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్లు కూడా ముందు నుంచి ఒక హీరోకి ఇచ్చిన ప్రాధాన్యత మరో హీరోకి ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. అలాగే బాహుబలి సినిమాపై ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రాజమౌళి పై ప్రశంసలు కురిపించినా త్రివిక్రమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.
Tollywood : ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య జరుగుతున్న వార్.
దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వారు నడుస్తుందని ప్రచారం జరిగింది. ఇటీవల మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి అందరూ ప్రస్తావించుకుంటున్న సమయంలో తాను మహేష్ తో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో అని రాజమౌళి కామెంట్ చేశారు. దీంతో అందరి దృష్టి రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై పడింది. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మరోసారి బయటపడిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజమౌళి చిన్న హీరోలు, చిన్నదర్శకుల సినిమాలను బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాంటిది త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఎప్పుడు కామెంట్ చేయలేదు.