Viral Video : సింహాలు, పులులు, జింకలు, నక్కలు ఇవన్నీ అడవి జంతువులు. ఇవి అడవుల్లో ఉంటేనే మనం సేఫ్ గా ఉంటాం. ఒకవేళ ఇవి అడవులు దాటి జనావాసాల్లోకి వస్తే వాటికీ ప్రమాదమే.. మనకూ ప్రమాదమే. పులులు, సింహాలు లాంటి జంతువులతో అయితే మనకే ప్రమాదం ఎక్కువ. ఈ మధ్య పులులు, సింహాలు జనాల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సింహం ఏకంగా పార్టీ జరుగుతున్న ప్లేస్ కు వచ్చి హడావుడి చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవుల్లో అయితే తమకు ఆహారం కావాలంటే ఏవైనా జంతువులను చంపి వాటి రక్తం తాగుతాయి పులులు, సింహాలు. మరి.. మనుషులు ఉండే ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి. అప్పుడు ఎలా. వాటికి ఆహారం కావాలంటే ఏం చేస్తాయి. ఏముందు.. ఎవరు దొరికితే వాళ్ల పీక పట్టుకొని రక్తం తాగేయడమే. తాజాగా ఓ సింహం అదే చేయబోయింది. ఏకంగా పార్టీ జరుగుతున్న ప్లేస్ కు వచ్చి అందరికీ షాక్ కు గురి చేసింది. అక్కడ ఏం జరుగుతోందో తెలిసేలోపు ఆ పార్టీకి వచ్చిన ఓ అతిథి వెంట పడింది.
Viral Video : చెట్టు ఎక్కినా వదలని సింహం
ఆ సింహం బారి నుంచి తప్పించుకోవడం కోసం అతడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఇక తప్పించుకున్నా అని అనుకున్నాడు. కానీ.. ఇంతలో అక్కడికి చేరుకున్న సింహం.. ఆ చెట్టు ఎక్కింది. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆ సింహం బారి నుంచి తప్పించుకోవడం కోసం కాళ్లతో దాన్ని కిందికి నెట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆ సింహం మాత్రం అతడిని అస్సలు వదల్లేదు. ఏం చేయాలో తెలియక.. చెట్టు మొదట్లోకి వెళ్లి కూర్చొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. పార్టీ జరుపుకునే ప్లేస్ లోకి సింహం రావడం ఏంటి.. అతిథిని తరమడం ఏంటి.. అందరూ ఏం చేస్తున్నారు. ఇంతకీ అతడిని కాపాడారా లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.