Bigg Boss 6 : ట్రెండీగా మారిన ఇనయా… ఒక్క ఎపిసోడ్ తో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది…

Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రోగ్రామ్ బిగ్ బాస్ సీజన్ 6 లో నామినేషన్ ప్రక్రియ గురించి తెలియజేయవలసిన అవసరం లేదు.. అప్పటివరకు స్నేహితుల ఉన్నవాళ్లు కూడా పనికిరాని రీజన్లను చెప్పి నామినేట్ చేస్తూ ఉంటారు.. అయితే నాలుగో వారం జరిగిన నామినేషన్ కూడా ఇదేవిధంగా జరిగాయి. ఇప్పుడు నామినేషన్ లో ఇంట్లో వాళ్ళు వర్సెస్ ఇనియా అన్నట్లుగా దూసుకుపోతుంది. కంటెస్టెంట్స్ అందరూ గుంపుగా ఇనియాను ట్రోల్ చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఆరోహి, గీతు, సుదీప, శ్రీహన్, కీర్తి, మెరీనా అండ్ సూర్య, రోహిత్, శ్రీ సత్య తో సహా వీళ్లు ఇనయా ను నామినేట్ చేయడం జరిగింది.

Advertisement

ఇనయాకు ముందు నుంచి శ్రీహస్ తో గొడవ జరగడంతో అతడు నామినేషన్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ ఇద్దరి నడుమ పిట్ట సంఘటన మళ్లీ ఒకసారి రావడంతో ఇనయా కూడా బాగానే యుద్ధానికి దిగింది. అదేవిధంగా ఆమె నామినేట్ చేయడానికి వెళ్ళగానే శ్రీహన్ ఆవలిస్తూ ఒక్క నిమిషం వెయిట్ అంటూ వినయాను కామెంట్ చేశాడు. అయితే ఇనయా కు ఎన్ని ఇది ప్లస్ అయింది. ఆ తదుపరి ఆర్జ్, సూర్యకు మైండ్ బ్లాక్ అయ్యే పంచ్ ను ఇసిరింది.. నలుగురు నన్ను లాక్కు వెళ్తుంటే నా డ్రెస్సు పైకి వెళ్తుంది అని మొత్తుకున్న ఎవ్వరు పట్టించుకోకుండా నన్ను లాక్కెళ్ళారు.. నువ్వేం ఫీమినిస్టవి అంటూ గట్టిగానే క్లాస్ ఇచ్చింది.

Advertisement

Bigg Boss 6 : ట్రెండీగా మారిన ఇనయా…

Inaya Sulthana jumped into the top place in just one episode
inaya Sulthana jumped into the top place in just one episode

ఇప్పటిదాకా అయితే చాలామంది వచ్చి నామినేట్ చేసినా కూడా అంతే బలంగా తన పాయింట్స్ ను తెలియజేసి డిపెండ్ చేసుకున్న ఇనయా ఎంతో దగ్గరగా ఉన్న మెరీనా అండ్ రోహితులు కూడా నామినేట్ చేయడం వలన ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇక ఇలా అనుకోలేదు అంటూ ఏడ్చేసింది.. మొత్తానికి సోమవారం జరిగిన ఈ ఎపిసోడ్ లో ఇనయ గ్రాఫ్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళింది అని తెలుస్తోంది.. ఇక రేవంత్ తదుపరి ఇనయ ఓటింగ్ లోను సెకండ్ ప్లేస్ లో కి వెళ్తోంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇనయా ట్రెండిగా మారింది.

Advertisement