YS Jagan : ఎన్టీఆర్ పేరు మార్పుపై ఇంకా ఏపీలో చర్చ కొనసాగుతూనే ఉంది. నిజానికి.. ఎన్టీఆర్ పేరు మార్పు అంశం ఏపీలో హాట్ టాపిక్ అయింది. చివరకు వైసీపీకి చెందిన కొందరు నేతలు కూడా పేరు మార్పును వ్యతిరేకించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వరకు ఓకే కానీ.. ఉన్న పేరును తీసేసి.. ఉన్నపళంగా వైఎస్సార్ పేరును పెట్టడం ఎందుకు.. దాని వల్ల వైసీపీకి వచ్చే లాభం లేదు కానీ.. పార్టీకి తీవ్రమైన నష్టం మాత్రం వాటిల్లుతుంది అంటూ వైసీపీ నేతలే సీఎం జగన్ కు చెప్పినా పట్టించుకోలేదట. చివరకు అసెంబ్లీలో చట్టం చేసి మరీ పేరు మార్పు చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించుకున్నారు జగన్. అంతవరకు బాగానే ఉంది కానీ.. తన వెనుక జరుగుతున్న విషయాన్ని చాలా లేట్ గా జగన్ పసిగట్టారా? తాజాగా పేరు మార్పు విషయంపై సీఎం జగన్ తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
![will ys jagan change his decision on changing ntr name for health university](https://www.yuvataram.in/wp-content/uploads/2022/09/ntrysr.jpg)
పార్టీకి, ప్రభుత్వానికి వచ్చే నష్టాన్ని నివారించేందుకు జగన్ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. కోస్తాంధ్రా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్టీఆర్ పేరు తొలగింపుపై పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా జగన్ కు రిపోర్టులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కాదని.. ఆయన అందరి నేత అని అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
YS Jagan : ఎన్టీఆర్ కు భారతరత్న
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ అంటే తనకు గౌరవం అని చాటి చెప్పేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి అయినా కేంద్రానికి పంపాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించినా కూడా దాన్ని అందుకునేది లక్ష్మీ పార్వతి కాబట్టి.. అది తమ పార్టీకి ప్లస్ అవుతుందని.. ఇది చంద్రబాబుకు మైనస్ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు అని అనుకొని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత రత్న వస్తే ఎన్టీఆర్ పేరు మార్పు విషయం కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరని.. అది కనుమరుగు అయిపోతుందని.. ఇది రాజకీయంగానూ, ప్రభుత్వ పరంగానూ సీఎం జగన్ కు మైలేజ్ ను ఇస్తుందని భావించి.. త్వరలోనే వైసీపీ పార్టీ తరుపున, ఏపీ ప్రభుత్వం తరుపున ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ త్వరలో వైసీపీ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.