Intinti Gruhalakshmi 10 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 10-September-2022 ఎపిసోడ్ 734 ముందుగా మీ కోసం. లక్కి, నందు లాస్యలతో చెపుతాడు, రేపు తులసి ఆంటీ వాళ్ల ఇంటికి పుాజ కి వెళ్లాలి, అక్కడికి హని కూడా వస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు, దాంతో నందు, లాస్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి ఇదంతా, మళ్లీ నాటకాలు, పిల్లల్ని అడ్డుపెట్టుకొని అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం కూడా తులసి వాళ్ళ ఇంటికి వెళదాం అని లాస్య అంటుంది.మనల్ని పిలవనప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళతాం, నేను రాను అని నందు అంటాడు. ఒకవైపు తులసి పొద్దున్నే లేచి, వినాయకుడితో ఇలా అనుకుంటూ ఉంటుంది, అన్ని విఘ్నాలను తొలగించి, మా జీవితాన్ని ఒక దారిలో పడేలాగా చూడు స్వామీ అని అంటూ, అందరినీ లేపుతుంది తులసి.కొద్ది సేపు తులసి వాళ్ల అత్తమామలు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు, తరువాత ఇంట్లోవాళ్లందరూ పనులు మొదలు పెడుతూ ఉంటారు. శ్రుతిని చూసి ప్రేమ్,శ్రుతి నేను తలంటుకొని వచ్చాను, తుడుస్తా అని అన్నావు కదా, శ్రుతి అని బుక్ చేస్తాడు, తులసి అక్కడే ఉండటంతో, శ్రుతి వెళ్లి గట్టిగా తుడుస్తుంది,దాంతో ప్రేమ్, శ్రుతి నడుము గిల్లుతాడు, వాళ్లు సరదాగా ఉండటంతో, తులసి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.
Intinti Gruhalakshmi 10 September Today Episode : లాస్య, నందుతో మాట్లాడుతున్న మాటలన్నీ విన్న సామ్రాట్.
ఆ తర్వాత ఇంతలో లక్కీ కూడా వస్తాడు.ఇంట్లో చెప్పే వచ్చావా అని తులసి వాళ్ళ అత్తమామలు అనగానే, మీరేం టెంక్షన్ పడకండి, వాళ్ళని రావొద్దని చెప్పి కూడా వచ్చాను నేనొక్కడినే అని, సరదాగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్లతో.అందరూ కలిసి పనులు మొదలు పెడుతూ ఉంటారు సరదాగా, ఇంతలో హనీని, సామ్రాట్ తీసుకొనివస్తాడు, థ్యాంక్యూ నాన్న, నీను అడగగానే తీసుకొని వచ్చారు అని అంటూ ఉంటుంది, కార్లో కూర్చుని. పదండి నాన్న వెళదాం అనగానే, నేను రాను అమ్మ, నాకు జూమ్ మీటింగ్ ఉంది,కార్లో అటెండ్ అయ్యాక వస్తాను, మీరు వెళ్లండి అని చెపుతాడు.దాoతొ సామ్రాట్ వాళ్ళ బాబాయ్, హని ఇద్దరూ లోపలికి వెళతారు.హనీ లోపలికి వెళ్లి, అందరితో గలగల మాట్లాడుతూ ఉంటుంది, తులసి హనీని ఓక్కదాన్నే పంపిస్తారు అనుకున్నాను, మీరు కూడా వచ్చారు చాలా సంతోషం అని సామ్రాట్ వాళ్ల బాబాయ్ తో మాట్లాడుతూ ఉంటుంది.

ఒకవైపు లాస్య, నందు కూడా తులసి వాళ్ళ ఇంటి బయట ఉంటారు, సామ్రాట్ కారుని చూసి సామ్రాట్ గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు,కొంచెం ముందుకు వెళ్లాక ఎట్టిపరిస్థితుల్లోనూ నువ్వే నిజం చెప్పొద్దని చెప్పిన విషయాన్ని చెప్పకు అని,ఇలా నిజాలన్నింటినీ చెబుతూ ఉంటుంది. సామ్రాట్ వింటాడు.వాళ్ళు లోపలికి వెళ్లగానే, సామ్రాట్ కారుదిగి,నందు చెప్పడం వల్లనే చెప్పలేదా, తులసి గారిని ఎంత అపార్థం చేసుకున్నాను, నేనే వచ్చి మాట్లాడితే అయిపోయేది, తులసి గారితో ఇన్ని అపార్థాలు వచ్చేవి కాదు అని అనుకుంటాడు. లోపలికి వెళ్ళి లాస్య అంటుంది, పిలవని పేరంటానికి వచ్చామని అనుకుంటున్నారా అని అనగానే, ఆ అవును అని ఇంట్లో వాళ్లు అంటారు, నందు, దివ్య ఎగ్జామ్స్ బాగా రాయాలని పూజ చేయించాడు,ప్రసాదమిచ్చి వెళ్దామని వచ్చాం అనగానే, దివ్య ప్రసాదం తీసుకుంటుంది, వెళతాము ఇంకా అనేలోపు, అభి ఆపుతాడు ఇక్కడి దాకా వచ్చి వెళ్లకండి అని,తులసి కూడా పూజకి ఉండమని అంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.