Nayanathara : హీరోయిన్ నయనతార సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజీని సంపాదించుకున్న నయనతార తాను నటించిన ఏ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం రాదు అన్నది అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తూ వస్తుంది. సినిమా పూర్తయిందా ఇక ఆ ప్రాజెక్టు గురించి పెద్దగా పట్టించుకోదు. అయితే గతంలో బాపు దర్శకత్వం వహించిన ‘ శ్రీరామరాజ్యం ‘ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ సినిమాలో సీత పాత్రలో నటించింది.
Nayanathara : నయనతార ప్రమోషన్స్ కు వస్తుందా… ఇది నిజమేనా…
నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సరే ప్రమోషన్స్ కి రానంటూ ముందే చెప్పేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ పాత్ర చేయడం లేదు. చిరంజీవికి చెల్లెలి పాత్రలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార రానుందని తెలుస్తోంది.

త్వరలో ‘ గాడ్ ఫాదర్ ‘ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరిగిపోతున్నాయి. ఈ వేడుకలో నయనతార పాల్గొనబోతుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకులను కలవాలనే ఉద్దేశంతో నయనతార ఈవెంట్ కు వస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.