Krishnam Raju : కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి టాప్ హీరోలలో ఒకరు. ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయినటువంటి కృష్ణంరాజు ఆదివారం తెల్లారి జామున 3: 25 నిమిషాలకు మృత్యువాత పడ్డారు. కృష్ణంరాజు గారు గత కొద్ది కాలంగా అనారోగ్యం తో బాధపడుతుండగా ఆయన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమైంచడంతో ఈరోజు ఉదయం 3 గంటల 25 నిమిషాలకు కన్నుమూయడం జరిగింది. ఆయన వృత్తికి సినీ ప్రముఖులు ఇంకా రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటుగా పరిగణించారు. కృష్ణంరాజు గారి కన్నుమూత సినిమా పరిశ్రమకు తీరని లోటు అని కృష్ణంరాజు ఫ్రెండ్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్రశాస్త్రి పేర్కొన్నారు. ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడి కొడుకు అని మనందరికీ తెలిసిందే. కృష్ణంరాజు గారు గత కొద్ది కాలంగా అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. రాజేశం సినిమాలో కృష్ణంరాజు గారు తన చివరి పాత్రగా ప్రభాస్ తో ఓ కీలకపాత్రలో నటించాడు.
Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత…
ప్రభాస్ తన పెదనాన్న ఎదుటివంటి కృష్ణంరాజు గారు మీద అభిమానంతో ఈ సినిమాలో నటించివలసిందిగా కోరడంతో ఆయన అంగీకరించారు. ప్రభాస్ తో కృష్ణంరాజుకి ప్రత్యేకమైన అనుబంధం ఉండడంతో ప్రభాస్ ఫ్యామిలీకి కృష్ణంరాజు మరణం తీరని లోటు అని చెప్పొచ్చు. కోవిడ్ టైం లో కూడా కృష్ణంరాజు హాస్పిటల్ లో చేరి చికిత్సను తీసుకున్నారు 4, 5 రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండి ట్రీట్మెంట్ పొందడం జరిగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు 1940 జనవరి 20వ తారీఖున జన్మించారు. టాలీవుడ్ లో దాదాపు 183 సినిమాలు నటించారు ఆ తర్వాత రాజకీయాలలో రంగ ప్రవేశం చేసి భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోకసభ ఎన్నికలలో కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత కూడా 13వ లోక్సభ ఎలక్షన్స్ లో నర్సాపురం లోక్ సభకు గాను పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. వేల తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో కృష్ణంరాజు గారు జాయిన్ అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రిలో నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

కృష్ణరాజు యొక్క సతీమణి శ్యామలాదేవి 1996 నవంబర్ 21న వీరిద్దరి వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. వీరి పేర్లు ప్రసిద్ధి ప్రకీర్తి ప్రదీప్తి. 1966 లో చిలక గోరింక సినిమాలో ఈయన తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించడం జరిగింది. కృష్ణరాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా పని సీఎం కేసీఆర్ అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా అనేకమంది సినీ ప్రేమికులు ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. 2006లో దక్షిణాది ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్లో లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కృష్ణంరాజు గారు పొందారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల సినిమా ప్రస్థానంలో అనేక ఇట్లు అందుకున్నాడు. మనుషులు మారాలి, బుద్ధిమంతుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్, పెళ్లికూతురు పల్నాటి పౌరుషం సతీసావిత్రి తాతా-మనవడు టూ టౌన్ రౌడీ అలాంటి దాదాపు 157 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా గోపికృష్ణ మూవీస్ పతాకం పేరుతో సినిమాలు ప్రొడ్యూస్ చేసి పలు సినిమాలు తెరకెక్కించారు కృష్ణంరాజు గారు.