Intinti Gruhalakshmi 12 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 12-September-2022 ఎపిసోడ్ 735 ముందుగా మీ కోసం. తులసి లాస్య,నందు ని పుాజ కి ఉండమని అంటోంది. ఇంతలో లక్కీ తుమ్ముతాడు, సారీ అని అనగానే, లాస్య నీ తుమ్ము మంచిదే లక్కీ అని అంటూ ఉంటుంది. హనీ నిన్ను చూడనేలేదు, ఒక్క దానివే వచ్చావా అని అడుగుతుంది, మీ డాడీ రాలేదా అంటే, వచ్చాడు కార్లో ఉన్నాడు అని అంటుంది. దాంతో అవునా, ఇది నిజమేనా అని తులసి ఇక్కడి దాకా వచ్చి ఇంటిలోకి రాలేదు అని సామ్రాట్ని పిలవడానికి బయటికి వెళుతుంది. తులసీ సామ్రాట్ ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ, మనసులో ముందు మాట్లాడాలా వద్దా అని తడబడుతూ, ఇద్దరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడి దాకా వచ్చి, లోపలికి రాలేదేంటి అని తులసి అడగ్గానే, ఏ హక్కుతో రావాలి, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కాదు అని అంటాడు.
Intinti Gruhalakshmi 12 September Today Episode : సామ్రాట్ ని పూజకి పిలిచిన తులసి
ఇలా మాట్లాడుతూ, సామ్రాట్ ప్రశ్నిస్తూ ఉంటాడు తులసిని, మీకు మాట్లాడాలని అనిపించటం లేదా ఒక మెసేజ్ పెట్టి వదిలేశారు అని అంటాడు. మీ అతి మంచితనం మంచిదేనా, మీకు ఎప్పటికైనా కష్టాలు తెచ్చిపెడుతుంది కదా అని అనగానే, తులసి నా మంచితనం వల్ల ఒకరు సంతోషపడితే, దాంతోనే సంతృప్తి పడతాను అని, ఇలా కొద్ది సేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ, లోపలికి రమ్మని అంటోంది తులసి, వెళతారు లోపలికి ఇద్దరు.హనీ పాప సామ్రాట్ తొ, మీరు కూడా పూజలో కూర్చోండి నాన్నా అని అనగానే, అభి కూర్చోవచ్చు, కానీ మా మమ్మీకి చేసిన అవమానానికి క్షమాపణ చెప్పిన తర్వాత, కూర్చోవాలి అని అనగానే, తులసి అభి ని ఆపుతుంది. కొద్ది సేపు మాట్లాడుకుంటూ లోపలికి వెళతారు, పూజ మొదలు పెడతారు, పంతులు గారు దంపతులని కంకణాలు కట్టుకోమని అనగానే, అందరూ కంకణాలు కట్టుకుంటారు, తులసి, సామ్రాట్ దగ్గరికి వచ్చి, హని పాప చేత సామ్రాట్కి కంకణం కట్టిస్తుంది.

హనీ తులసికి కుాడా కంకణం కడుతుంది.పూజ పూర్తవుతుంది. తర్వాత పెద్దవాళ్ళ దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు. అభి,డాడీ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాం అని, అంకితతొ అంటాడు, ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రేమ్ తొ ఆశీర్వాదం తీసుకొవారా అనగానే, కొత్తగా మాట్లాడుతున్నావేంటి తీసుకోను అని అనగానే, సామ్రాట్ అంటాడు మీ అమ్మగారు మీనాన్నకి విలువ ఇస్తున్నప్పుడు, నువ్వెందుకు ఇవ్వడం లేదు అని అంటూ, సారి మీ ఫ్యామిలీ విషయం లో ఇన్వాల్వ్ అయ్యాను, ఏదో అనిపించింది, క్యాజువల్గా అనేశాను అని అంటాడు. ఫర్వాలేదు సార్ అని ప్రేమ్ అంటాడు,తప్పు మీది కాదు కొంతమంది, ఆవేశానికి మా అమ్మ బలి అవుతూ వస్తుంది అని, ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, తులసి ప్రసాదాల పని చూడమని దివ్య, శ్రుతి కి చెబుతోంది,తులసి వాళ్ళ మామయ్య, లక్కీతో అరే లక్కీ గుంజీళ్లు తీస్తే, చదువు బాగా వస్తుంది అని అనగానే, అయితే చదవాల్సిన అవసరం లేకపోతే, ఎన్ని గుంజిళ్ల అయినా తీస్తాను అని అంటాడు. దాంతో అందరూ నవ్వుతారు. ఇలా సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.