Intinti Gruhalakshmi 14 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 14-September-2022 ఎపిసోడ్ 737 ముందుగా మీ కోసం. శృతి, ప్రేమ్ కి టాస్క్ ఇస్తారు, ప్రేమ జంట గొడవ పడితే ఎలా ఉంటుందో అని, కానీ వాళ్లు నిజంగానే గొడవపడతారు, తులసి ప్రేమ్ ని ఆపుతుంది, అయినా కూడా వాళ్లు అలానే గొడవ పడతారు, దాంతో తులసి గట్టిగా ప్రేమ్ ఆపురా అని అనడంతో ఆపుతారు, మీరు యాక్ట్ చేస్తున్నారా, నిజంగానే గొడవపడుతున్నారా అని అనడంతో, లేదమ్మా యాక్ట్ చేస్తున్నాం అని ప్రేమ్ అంటాడు. తరువాత తులసి వాళ్ల అత్తమామలు చిట్టి తీస్తారు, వాళ్ళకి డ్యాన్స్ చేయమని రావటంతో, వాళ్ళు డ్యాన్స్ వేస్తారు.తర్వాత నందు, లాస్యకి డ్యాన్స్ వేసి, భార్యని ఎత్తుకొని తిప్పాలి అని వస్తుంది, దాంతో వాళ్లు డ్యాన్స్ వేస్తారు.వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే, తులసి ఇబ్బంది పడడాన్ని సామ్రాట్ చూస్తూ ఉంటాడు.తరువాత తులసి చిట్టి తీస్తుంది.
Intinti Gruhalakshmi 14 September Today Episode : తులసికి క్షమాపణ చెప్పి, తిరిగి ఆఫీస్ కి రమ్మని చెప్పిన సామ్రాట్.
తియ్యగా పాట పాడాలి అని వస్తుంది, తియ్యగా పాట పాడాలి అంటే, నోట్లో చక్కెర వేసుకుని పాడాలా అని అనడంతో, లేదు మీ మనసుతో పాడండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు, తులసి పాట పాడుతుంది.తన జీవితంలో జరిగిన విషయాలన్ని గుర్తు తెచ్చుకుంటూ, తులసి పాట పాడుతుంది.చివరిగా సామ్రాట్ చిట్టి తీయబోయే లోపు, లక్కీ ఉండి అంకుల్ మనం సరదాగా డ్యాన్స్ వేద్దామా అని అనగానే, దివ్య వేయండి కాకపోతే అది మాత్రం టాస్క్ లోకి రాదు అనడంతో, పర్వాలేదు అని సామ్రాట్ డ్యాన్స్ వేస్తాడు లక్కీతో.మీకు నచ్చిన కథను చెప్పామని సామ్రాట్కి చిట్టి రావటంతో, సామ్రాట్ ఒక బిజినెస్ మ్యాన్ కథ అని మొదలుపెడతాడు, కథ గురించి చెబుతూ ఉంటాడు.లాస్య నందుకి అర్థం అవుతుంది సామ్రాట్ చెప్పేది వాళ్ళ గురించే అని.

ఇన్ డైరెక్టుగా చెపుతూ వుంటాడు నిజాన్ని అంతా, తులసి చేత నందునే నిజం చెప్పొద్దూ అన్న నిజాన్ని, ఇలా ఇన్ డైరెక్టుగా నిజాన్ని బయటికి చెబుతూ ఉంటాడు కథ రూపంలో, ఆ బిజినెస్ మేన్ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి, అందరి ముందు సామ్రాట్ క్షమాపణ చెబుతాడు తులసికి, లాస్య నందు అక్కడి నుంచి వెళ్లిపోతారు, సామ్రాట్ తులసితో నా తప్పును క్షమించి, రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత తులసి వినాయకుడి దగ్గరికి వెళ్లి, దండం పెట్టుకుంటూ, ఇలా అనుకుంటుంది, నిన్నే నమ్ముకున్న నన్ను ఇంత తొందరగా అపనిందల నుంచి బయటపడేలా చేస్తావని అనుకోలేదు అని,బిక్కుబిక్కుమంటూ, సహాయం చేసిన మనిషిని బాధపెట్టానే అన్న బాధ,కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.