Mrunal thakoor : తెలుగు పరిశ్రమకి ‘ సీతారామం ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తను స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ నటించాడు. తన మొదటి సినిమాతోనే మ్రోణాల్ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. దీంతో తనకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చడించింది. ఈ సందర్భంగా పెళ్లి కాకపోయినా నేను పిల్లల్ని కంటాను అని కామెంట్స్ చేసింది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mrunal thakoor : పెళ్లి కాకపోయినా పిల్లల్ని కంటాను అంటున్న మృణాల్ ఠాకూర్…
మృణాల్ మాట్లాడుతూ 30 ఏళ్ల వయసున్న మహిళలు ప్రేమ, డేటింగ్, పెళ్లి, పిల్లలు గురించి ఎక్కువగా ఆసక్తి ఉండదని చెప్పుకోచ్చింది. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని నా మనసులో ఏముందో తెలుసుకునే వాళ్ళని ఇష్టపడతాను. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటాను. అలాగే అతడు నా వృత్తిని గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్ళు దొరకటం కష్టం. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి చేసుకోను అని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత మ్రోణాల్ మాట్లాడుతూ ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై అంతగా ఇంట్రెస్ట్ లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కంటాను. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కంటాను. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని చెప్పింది. అందుకు మా అమ్మ కూడా ఒప్పుకుంది అని చెప్పుకొచ్చింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా అంగీకరించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మృణాల్ ఠాకూర్.