Tollywood : టాలీవుడ్ లో టాప్ హీరో ప్రభాస్… టాప్ హీరోయిన్ సమంత…

Tollywood : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు. బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతకుముందు ప్రభాస్ కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం బాహుబలి హిట్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా హిట్ కొట్టలేకపోయింది. కానీ వీటి ప్రభావం మాత్రం ప్రభాస్ క్రేజ్ పై పడలేదు. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా పెంచాడే తప్ప తగ్గించిందేం లేదు.

Tollywood : టాప్ హీరో ప్రభాస్… టాప్ హీరోయిన్ సమంత…

Prabhas and Samantha placed top position in tollywood by ormax media servey
Prabhas and Samantha placed top position in tollywood by ormax media servey

రాధేశ్యామ్ కంటే ముందు ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్లు తీసుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. నిర్మాతలు కూడా ప్రభాస్ ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్స్ వస్తే చాలు వేయికోట్లు వచ్చేస్తాయని ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత ప్రజాదారణ పొందిన టాలీవుడ్ నటుల్లో మొదటి స్థానంలో ప్రభాస్ నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.

దాంతో ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెలా దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహిస్తుంది. టాప్ పొజిషన్లో ఉన్న లిస్టుని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్ నటీనటుల సర్వే జాబితాను వెల్లడించింది. హీరోల్లో ప్రభాస్, హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచారు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ,మహేష్ బాబు వరుస స్థానాల్లో ఉన్నారు. హీరోయిన్లలో కాజల్, అనుష్క తర్వాతే పొజిషన్లో ఉన్నారు.