Intinti Gruhalakshmi 17 September Today Episode : ఇంటిoటి గృహలక్ష్మి సీరియల్ 17-September-2022 ఎపిసోడ్ 740 ముందుగా మీ కోసం. సామ్రాట్ నందుతో మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ ఉంటాడు.అప్పుడు అడుగుతాడు, ఒక్కరోజు మీ కుటుంబంతో ఉంటేనే నాకెంతో సంతోషంగా ఉంది, నువ్వు ఎంత తప్పు చేశావు అని అనగానే, చందమామ దగ్గర్నుంచి అలానే ఉంటుంది, దాంట్లో ఉన్న మచ్చలు దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది అని అనగానే, చందమామలో కూడా మచ్చల్ని చూస్తున్నావా నువ్వు అని అనడంతో, ఒక్కసారిగా ఫైల్ కిందపడబోతుంది నందు చేతిలో నుంచి దాన్ని సామ్రాట్ పట్టుకొని,ఏదైనా విలువైన వస్తువులను చేజార్చుకోవద్దు, నీలా చేజార్చుకుంటే ఇంకొకరికి లాభంగా మారుతుంది, నువ్వు చేజార్చుకున్నాడు దానికి పొందే అదృష్టవంతులు ఎక్కడున్నాడో అని ఇలా మాట్లాడుతూ ఉండగా, సార్ ఇది నాకెందుకు చెబుతున్నారు అనడంతో, అవును కదా ఇప్పుడు నీకు చెప్పి ప్రయోజనమేంటి అని, ఇలా మాట్లాడుతూ ఉండగా, తులసి లాస్య వీళ్ల దగ్గరకి రావటంతో, మాటని మార్చి తులసితో రేపు పొద్దున్నే మనం పనిమీద వెళ్ళాలి, నేను పికప్ చేసుకుంటాను అని చెపుతాడు, ఒకవైపు నందు డ్రింక్ చేసి సామ్రాట్ అన్న మాటల్నే తలచుకుంటూ రోడ్డుమీదనే ఉంటాడు.
సామ్రాట్ ఆ రోజు తాగి ఏమన్నాడో అని ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవైపు సామ్రాట్ తులసిని ప్రపోజ్ చేసినట్లు, ఇద్దరూ తన కళ్లముందే ఉన్నట్టు ఊహించుకొని, కోపంగా తాగిన బీర్ బాటిల్ని రోడ్డుపై విసిరేస్తాడు, రోడ్డుపైనే ఇలా అరుస్తూ ఉంటాడు కోపంగా,ఒరేయ్ సామ్రాట్ అనుకుంటూ కోపంగా ఉంటాడు, కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉంటాడు, ఆ కారు ఒక దగ్గర ఆగిపోతుంది.దాంతో కారు దిగి, సురేష్ అనే ఒక వ్యక్తి కి ఫోన్ చేసి, ఒరేయ్ రారా కారు రిపేర్ చేయమని అనడంతో, ఆ వ్యక్తి వచ్చి కారు రిపేర్ చేస్తాడు,డ్రింక్ చేసి ఉన్నారు, చదువుకున్న వారే కదా, డ్రింక్ చేసి డ్రైవ్ ఎలా చేస్తారు యాక్సిడెంట్ అయితే, మీ కాళ్లు చేతులు విరిగిపోయాయి అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా, ఇలా రమ్మని ఆ వ్యక్తిని మళ్లీ పిలిచి,నేను చెప్పినట్టు చెయ్యి,నీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తాను అనడంతో, చెప్పండి సార్ అని అంటాడు, ఒక వ్యక్తి కారు బ్రేక్ లు తెంపాలి అనడంతో, అలాగే సార్ ఎవరిది అని అడగ్గానే, బిజినెస్మేన్ సామ్రాట్ అనడంతో, నా వల్ల కాదు సార్ నేను సామ్రాట్ గారి కారు జోలికి వెళ్లలేను అనడంతో, నాకేమైనా భయమా నేనే వెళతాను అని నందు సామ్రాట్ ఇంటికి వెళతాడు.
Intinti Gruhalakshmi 17 September Today Episode : డ్రింక్ చేసి సామ్రాట్ కార్ వైర్లను తెంపేసిన నందు
అక్కడ వాచ్మెన్ కూడా లేకపోవడంతో వెళ్లి కారు వైర్ని తేoపేస్తాడు, మమ్మల్ని ఆఫీస్లో ఉంచి, మీరు షికార్లకు వెళతారా పొద్దున్నే మీరు వెళ్లేది తులసివనానికి కాదు హాస్పిటల్ కి అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు.తెల్లవారగానే సామ్రాట్ బయటికి వస్తాడు, ఇంతలో తులసి వస్తుంది ఆటో దిగి, అదేంటి నేనే వస్తాను అని చెప్పాను కదా అనడంతో, ఇటువెైపె కదా వెళ్లడం మీరు రావడం మళ్లీ శ్రమ ఎందుకని నేనే వచ్చాను అని ఇలా మాట్లాడుతూ, కారులో వెడతారు, కారు బ్రేకులు ఫెయిలయ్యాయి అని సామ్రాట్ అంటాడు, ఇలా ఎంత ప్రయత్నించినా బ్రేక్ పడకపోవడంతో, వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది.ఇదంతా నందు కలగంటాడు, తులసి అని గట్టిగా అరవటంతో, లాస్య వచ్చి ఎందుకు తులసి అంటూ అరిచావు అని ప్రశ్నిస్తుంది,నేను లాస్య అని అరిస్తే, నువ్వు తులసి అని అంటున్నావు ఏంటి అని నందు బుకాయిస్తాడు,అప్పుడు లాస్య వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి, అంటుంది కొంపదీసి తులసి గానీ కలలోకి వచ్చిందా అని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.