Intinti Gruhalakshmi 23 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 23-September-2022 ఎపిసోడ్ 745 ముందుగా మీ కోసం. సామ్రాట్ తో లాస్య ఇలా అంటుంది. నందు ప్రపోజ్ చేశాడు సార్ మీ ఇంటి దగ్గర ఇళ్లు చూడమని అని అనగానే, ఆఫీస్ కి దూరం అవుతుంది కదా అని సామ్రాట్ అంటే, ఏం ఫరవాలేదు సార్ మీ సంతోషమే మాకు ముఖ్యం అని లాస్య అంటోంది. తరువాత మేనేజర్ బయటికి వెళ్లి ఎవరితోనో ఫోన్ మాట్లాడతాడు, సామ్రాట్ నన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు, ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమన్న పెడతాడు అని ఇలా మాట్లాడుతూ ఉండగా, తులసి అంతా వింటుంది, అప్పుడు మేనేజర్ ఈ విషయం సామ్రాట్కి చెప్పకుండా ఉండాలంటే, మీకెంత ఇవ్వాలి అని ఇలా మాట్లాడుతూ ఉండగా, తప్పు చేశానన్న భయం కూడా లేదు నీకు అని అంటోంది. మీరు నిజాన్ని చెబితే మీ ప్రాణాలకే ప్రమాదమని బెదిరిస్తాడు మేనేజర్, డీల్ పేపర్ మీద సంతకం చేసి ఆ ఫైల్ను మేనేజర్కి ఇవ్వబోతుంటే తులసి వచ్చి ఆపుతుంది.
ఆ మేనేజర్ బండారాన్ని బయట పెడుతుంది, దాంతో సామ్రాట్కి చాలా కోపం వస్తుంది, ఇంత మోసం చేస్తావా నీ పని చెబుతాను అని కోపంగా మేనేజర్ మీదికి పోయేలోపు, మీరే ఎలాగైనా కాపాడండి నా కూతురి పెళ్లి ఉంది అని తులసిని వేడుకోవడంతో, ఆగండి సామ్రాట్గారూ ఈ మనిషి కడుపున పుట్టినందుకు ఆడపిల్ల జీవితం ఎందుకు పాడవడం, మనకు ఆ పాపం ఎందుకు వదిలేయండి అని చెబుతుంది. తర్వాత నందు అంటాడు నిజం తెలిసింది బానే వుంది సార్, కానీ మేనేజర్ లేకపోతే వర్క్ అంతా ఎవరు చూసుకుంటారు అని అనగానే, లాస్య ఇలా అంటుంది మనలోనే ఎవరైనా ఒకరిని సమర్ధవంతులని సామ్రాట్గారూ నిర్ణయిస్తారు అనగానే, సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు. సామ్రాట్ అందరినీ పిలిచి మీకొక న్యూస్ చెప్పాలి అని, ఈ రోజు నుంచి తులసీ గారిని జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పడంతో, అందరూ సంతోషపడతారు, తులసి మాత్రం మీరు సరదాగా మాట్లాడతారు కదా అని అనడంతో, లేదు తులసి గారు నిజంగానే చెబుతున్నాను, మీ శక్తి మీకు తెలియదు, అది నాకు తెలుసు అని, వాళ్ళ బాబాయ్తో అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయమని చెబుతాడు.
Intinti Gruhalakshmi 23 September Today Episode : షాక్ లొ నందు లాస్య

అసలు నాకు ఎటువంటి అనుభవం లేదు నాకు ఏలా ఇస్తారు అని తులసి అనగానే, ఇప్పుడైనా అర్థమైందా మామ్ అని అభి మాట్లాడుతూ ఉంటాడు, మీరే అడగండి మీకే చదువు రాదు అయినా మిమ్మల్ని ఈ పోస్టులు పెడుతున్నాడు, మీరు సంతకమే సరిగ్గా చేయలేరు అలాంటిది ఫైల్స్ ఎలా చదివి, పెద్ద కంపెనీని మీరేలా రన్ చేస్తారో అడగండి, మీ కంటే సమర్థవంతుడైన నందు గారు ఇక్కడే ఉన్నారు అలాంటి వాళ్లను పక్కకు పెట్టి కూడా నీకు జాబ్ ఇస్తా అంటున్నాడు ఎందుకో అడగమని అని అభి అడుగుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ ఇలా అంటూ ఉంటాడు, నాకు తులసిగారు నిజాయితీగా ఉంటారు, సమర్థవంతురాలు అనిపించింది, ఆ రోజు వైజాగ్లో ఒక్కరే వెళ్లి మీటింగ్ ని పూర్తి చేశారు, ఈ రోజు ఏమైంది, మీరన్నట్లు నిజమే నందు సమర్థవంతుడు కానీ, ఈ పోస్టుల్లో నాక్కావల్సింది నిజాయితీ కూడా నందు గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం నాకు రాలేదు, వచ్చినా రెండు మూడుసార్లు నాకు అసంతృప్తి అనిపించింది, అందుకే నేను తులసి వైపు మొగ్గు చుపాను అని తులసికి సమాధానం చెబుతాడు.
ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఆ పోస్టుకు అప్పుడు ఆలోచిస్తాను అని అనడంతో, తులసి వాళ్ళ మామయ్య నేను ఒప్పుకుంటున్నాను తులసి తరపున అని అంటాడు, ఇలా ఇంట్లో అందరూ మేము ఒప్పుకుంటున్నాం అని అనడంతో, తులసి కూడా ఒప్పుకుంటుంది, వెంటనే హాని పాయసం చేసుకొని తీసుకురండి ఆంటీ అనడంతో సరే అని అంటుంది. తరువాత లాస్య నందు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాడు, అసలు ఏం చేయాలని అనుకుంటున్నాడు అని సామ్రాట్ గురించి, అప్పుడు లాస్య మనకి వేరే దారి లేదు బయటికి వెళితే మనం గడ్డిపరకతో సమాణం అందుకే ఇక్కడే జాబు చెయ్యాలి అని అంటూ ఉంటుంది నందుతొ, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.