Intinti Gruhalakshmi 25 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 25-September-2022 ఎపిసోడ్ 747 ముందుగా మీ కోసం. సామ్రాట్ వాళ్ళ ఇంట్లో డాక్టర్ వస్తాడు, హానిని చెక్ చేయడానికి, హని హెల్త్ బానే ఉంది అని చెప్పడంతో, అందరూ సంతోషపడతారు, తర్వాత సామ్రాట్ నందు లాస్యతో ప్రెస్మీట్ ఆరెంజ్ చేయమని చెబుతాడు. ఇప్పుడు దేనికి సార్ ప్రెస్ మీట్ అని అడగ్గానే, మళ్లీ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అది అందరికీ తెలియాలి, వాళ్లకున్న డౌట్స్ క్లారిఫై అవ్వాలి అని అనడంతో, మనం పనులు మొదలుపెడితే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్ ఇదంతా ఎందుకు అని తులసి అంటుంది. లేదు తులసిగారు ప్రెస్మీట్ చేయాలి అనగానే, ఆ రోజు జరిగిన సంఘటనలని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు, ఎవ్వరో తెలియదు మా అమ్మ ని బ్యాడ్ చేశారు, వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు అని ప్రేమ్ అనగానే, వాళ్ళని ఎలాగైనా ఎవరో కనిపెట్టాలని అని సామ్రాట్ కూడా కోపంగా అంటాడు.
వెతికి ఏం చేస్తారు అని తులసి అంటుంది, అదేంటి తులసిగారు అలా అంటున్నారు మీకు చెడు చేసిన వాళ్లని ఊరికే వదిలిపెడతారా అంటే, వాళ్లు నాకు చెడు చేశారని నేను వాళ్ల మీద పగ పెంచుకొని, మన కాలికి ముళ్లు గుచ్చుకుంది కదా అని నడవడమే మానేయము కదా ఇంకొక సారి ముళ్లు గుచ్చుకోకుండా జాగ్రత్తపడితే చాలు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటు, నా పని నేను చేసుకుంటాను అని తులసి అనడంతో, సామ్రాట్ మెచ్చుకుంటాడు, తన ఆలోచన విధానానికి, తరవాత లాస్య మనకు మంచి అవకాశం వచ్చింది ప్రెస్మీట్ ఆరెంజ్ చేయమని మనకే చెప్పాడు కాబట్టి ఎలాగైనా ఈ సామ్రాట్ ని తులసిని మళ్లీ దూరం చేయాలి అని, ప్రెస్ మీట్లో కుట్ర పన్నడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, అక్కడికి వచ్చిన రిపోర్టర్ లకు మర్యాదలు చేస్తూ తను చెప్పిన ప్రశ్నలు అడగమని చెబుతోంది.
Intinti Gruhalakshmi 25 September Today Episode : తులసి ఏం చేయనుంది?

దాంతో ప్రెస్మీట్ మొదలుపెట్టిన తర్వాత తులసి గారు మీకేమౌతారు, తులసి గారూ మీరు ఇద్దరూ ఇష్టపడుతున్నారని బయట టాక్, అందుకు మీరు ఏం సమాధానం చెబుతారు, అసలు మీ భార్య గురించి మీరు ఎప్పుడూ చెప్పలేదు, ఎక్కడ మీ భార్య ఎవరు, అని ఇలా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఇవన్నీ లాస్య వాళ్ళచేత అడిగి ఇస్తూ ఉంటుంది. దాంతో సామ్రాట్కి ఒక్కసారిగా కోపం వస్తుంది, రిపోర్టర్స్ వేసిన ప్రశ్నలకు సామ్రాట్ వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇవ్వనున్నాడు అనేది రానున్న ఎపిసోడ్ లో తెలుస్తుంది, ప్రెస్ మీట్ జరిగిన తరువాత మా అమ్మకి ఇంత అవమానం చేస్తారా అని అభి సామ్రాట్ని నిలదీస్తూ ఉంటాడు.
ఇంత జరిగాక కూడా ఇంకా మీతో పాటు బిజినెస్ చేయాల్సిన అవసరం మా అమ్మకు లేదు, అసలు మీ భార్య ఎవ్వరు, మీ గతం ఏంటి అని, ఇలా చాలా ప్రశ్నలు వేస్తూ సామ్రాట్ని అభి నిలదీస్తూ ఉంటాడు, తులసి ఎంత ఆపినా కూడా ఆగడు, దాంతో సామ్రాట్ ఒక్కసారిగా సోఫాలోకి కుంగిపోతూ కూర్చుంటాడు, అసలు సామ్రాట్ గతం ఏంటి అనేది సామ్రాట్ తన నోటితో చెప్పనున్నాడా, లేదా తులసి సామ్రాట్ ఇద్దరూ బిజినెస్ ఇక్కడితో ఆగిపోనుందా, అనేది రానున్న ఎపిసోడ్లో తెలియనుంది.