Intinti Gruhalakshmi 30 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30-September-2022 ఎపిసోడ్ 751 ముందుగా మీ కోసం. తులసి ఆఫీస్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది, తులసిని చూస్తూ, లాస్య, నందుతో ఇలా అంటూ ఉంటుంది, వంటింట్లో కుందేలులా వుండేది, ఇప్పుడు ఎలా చేస్తుందో చూడు అని అనగానే, సామ్రాట్ గారు జబిచ్చారు, ఇప్పుడేం చెయ్యలేము, ఎక్కువగా ఆలోచించకు అనగానే, నీతో చెప్పి టైం వేస్ట్, నేనే తులసి ని ఎలా ఇరికిస్తానో చూడు అని అనగానే, అక్కడికి తులసి వస్తుంది, బడ్జెట్ ఫైల్ రెడీ చేశారా లేదా అని, మీరు పనిచేయకపోతే చెప్పండి, ఆ పనిని వేరేవాళ్లకు అప్పజెప్పమని సామ్రాట్ గారి కి చెబుతాను, మనమిక్కడ జీతం తీసుకునేది పని చేయడం కోసమే అంటూ చెప్పి వెళ్ళిపోతుంది. ఒకవైపు ప్రేమ్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అక్కడికి శృతి కాఫీ తీసుకుని వస్తుంది, కొద్దిసేపు వాళ్లు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు, తర్వాత ప్రేమ్, సామ్రాట్ గారు ఒక మ్యూజిక్ ఈవెంట్ ఆఫర్ ఇచ్చారు అక్కడికి వెళుతున్నాను అని చెబుతూ ఉంటాడు, ఇలా సరదాగా మాట్లాడుకుంటారు శృతి, ప్రేమ్.
Intinti Gruhalakshmi 30 September Today Episode : తులసిని ఆఫీస్కి రాకుండా చెయ్యమని సామ్రాట్ దగ్గర మాట తీసుకున్న అనసూయ
తర్వాత అనసూయ ఇంట్లో దండెం మీద బట్టలు తీస్తూ, చిరాకుగా ఉంటుంది, ఇంట్లో ఎవ్వరూ నా మాట పట్టించుకోవడం లేదు అని, అప్పుడు అక్కడికి అభి వచ్చి, ఇంట్లో వాళ్లు ఎవ్వరూ మాట వినటం లేదు నానమ్మ నాలాగే నీమాట కూడా వినటంలేదు, ఒకప్పటి అనసూయ ఎలా ఉందో గుర్తుంది కదా, నువ్వు కుడా అలాగే ఉండాలి ఇప్పుడు అని అనవసరంగా అనసూయని రెచ్చగొడతాడు అభి, తరువాత తులసి, సామ్రాట్కి ఫోన్చేసి మీటింగ్ కి రాలేదని అడుగుతూ ఉంటుంది, ఆలస్యం అవ్వకుండా రండి ఇవాళ ఇంపార్టెంట్ మీటింగుంది అని సరదాగా, వీళ్లిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి, సామ్రాట్ని ఆటపట్టిస్తూ ఉంటాడు. సామ్రాట్ హానిని బుజ్జగిస్తూ స్కూల్కి పంపిస్తాడు, అప్పుడు అక్కడికి అనసూయ వస్తుంది, ఒక మాట ఇవ్వండి అని అడుగుతుంది, మాటిచ్చాక తప్పొద్దు అని అనగానే, ఇస్తున్నాను చెప్పండి అని అనగానే, తులసి ఇక మీదట మీ ఆఫీస్ కి రావొద్దుా, మీకు మీరుగా తులసికి దూరంగా ఉండాలి, ఆఫీస్కి రాకుండా చేయాలి అని అంటూ ఉంటుంది.

ఎందుకు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు మీరు అని సామ్రాట్ అనగానే, ఏమీ జరగకూడదని నా బాధ మీరు ప్రశాంతంగా ఉండాలి, తులసి ప్రశాంతంగా ఉండాలి, అని ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటుంది సామ్రాట్తో, నేను ఇక్కడికి వచ్చాను అన్న విషయం కూడా మీరు తులసి కీ చెప్పకూడదు అని అనగానే, సామ్రాట్ అదేంటమ్మా నిర్ణయం మీరు తీసుకున్నారు, దోషిగా నన్ను నిలబెడుతున్నారా అని సామ్రాట్ అంటూ ఉంటాడు. నా కుటుంబ గౌరవం కోసం ఇదే మంచిది అంటూ, ఇలా మాట్లాడుతూ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి ఈ పని చెయ్యండి అంటూ బాధపడుతూ వెళ్లిపోతుంది. అనసూయ మాటలకు షాకైన సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు, తరువాత ప్రేమ్ మ్యూజిక్ ఈవెంట్ ఆడిషన్స్లో సెలక్ట్ అవుతాడు, కానీ అక్కడ ఒక వ్యక్తి ప్రేమ్ కి అడ్డు పడుతూ ఉంటాడు, కష్టపడింది నేను, ట్యాలెంట్ ఉంది నాకు, కానీ అడ్డదారిలో రికమండేషన్ ద్వారా నువ్వు సెలక్టయ్యావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.