Krishna-indira devi : గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదాలు కలిగిస్తున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కొడుకు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. తాజాగా కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో మరణించారు. కొన్నేళ్ల ముందు కృష్ణ రెండో భార్య ప్రముఖ నటి విజయనిర్మల కూడా మృతి చెందారు. ఇలా వరుసగా కృష్ణ ఫ్యామిలీని విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మృతి చెందిన ఇందిరా దేవి ఎవరో కాదు కృష్ణకు స్వయాన మేనమామ కూతురు. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ముసళ్ళమడుగు.
విజయనిర్మల కృష్ణకు రెండో భార్య. అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి అయ్యి నరేష్ కూడా పుట్టేసాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలో నటించడం, కృష్ణతో చనువుగా ఉండడం భర్తతో విడాకులు తీసుకొని అధికారికంగానే కృష్ణను వివాహం చేసుకుంది. కృష్ణ హీరోగా చేసిన కొన్ని సినిమాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఆ టైంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం తెలిసిన ఇందిర ఏం చేయలేదు అని అంటారు. కృష్ణ అవుట్ డోర్ లో ఉన్నప్పుడు విజయనిర్మల దగ్గరుండి కృష్ణ ఆరోగ్యం చూసుకునేదట.
Krishna-indira devi : కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి…

ఆ తర్వాత కృష్ణ సడన్ గా తిరుపతిలో విజయనిర్మలకు తాళికట్టి భార్యని చేసుకున్నప్పుడు ఇందిరకు బాధ ఉన్న బయటకు పెట్టలేదట. కొద్దిరోజులు భర్తతో మనస్పర్ధలు వచ్చాయని అంటారు. ఆ తర్వాత ఇందిరా విజయనిర్మలను బాగా చూసుకునే వారిని తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకోవడం ఇందిరకు కూడా నచ్చేదని అంటారు. అయితే ఇందిరా బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం అయ్యేవారు కాదు. ఇండస్ట్రీలో సినీ ఫంక్షన్లకు ఇతర ఫంక్షన్లకు కృష్ణ విజయనిర్మల కలిసి వచ్చేవారు.