Intinti Gruhalakshmi 8 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 08-September-2022 ఎపిసోడ్ 732 ముందుగా మీ కోసం. తులసి సామ్రాట్ దగ్గరికి వచ్చి నిలదీస్తాడు. మీకు నాతో పార్టనర్షిప్ ఇష్టం లేకపోతే, ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు. మీకంత విలువ ఇస్తే, మీరు ఇలా చేస్తారా అని అంటాడు.ఇంట్లో వాళ్లు తులసి ఏ తప్పు చేయలేదు, అపార్థం చేసుకోవద్దు అని అందరూ అంటారు. అయినా కూడా సామ్రాట్ వినకుండా, పేపర్లో పడిన న్యూస్ ని చూపిస్తూ, పేపర్ని విసిరికొడతాడు. తనకే సంబంధం లేదు అని చెప్పినా కూడా వినడు. ఆవేశంతో మాట్లాడి, వెళ్లిపోతాడు అక్కడి నుంచి. ఇంటికి వెళ్లి, సామ్రాట్ ఇంట్లో వాళ్ళమీద కూడా అరుస్తూ ఉంటాడు, చిరాకుగా ఉంటాడు. ఇంతలో వాళ్ళ బాబాయ్ ప్రశ్నిస్తాడు,పేపర్లో న్యూస్ వేసింది తులసి అని చెపుతాడు. తులసిది అలా చేసే మనస్తత్వం కాదు, ఏదో పొరపాటు జరిగింది అని తులసిని సమర్థిస్తూ మాట్లాడతాడు.
Intinti Gruhalakshmi 8 September Today Episode : తులసి గురించి సామ్రాట్ని అడిగిన హని
ఇలా మాట్లాడుతూ ఉండగా, హాని పాప వస్తుంది. నాన్న, తులసి అంటీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు, ఒకసారి ఫోన్ చేస్తారా అని అడగగానే, హని పాప మీద కోప్పడతాడు సామ్రాట్.మరోవైపు తులసి ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు, అభి అంటాడు, ఆ రోజు నేను అమ్మ పరువు తీశానని నన్ను తిట్టారు, ఈరోజు సామ్రాట్ అన్ని మాటలంటుంటే ఒక్కరు కూడా ఏమీ మాట్లాడలేదు, ఏంటి అని నిలదీస్తాడు.దాంతో అందరూ తులసీని నిలదీస్తారు, నువ్వు మౌనంగా ఉండటం మాకు కూడా నచ్చలేదని, తప్పు చేసిన వాళ్లే అలా ఉంటారని, ఎందుకు అలా ఉన్నావని, ఇంట్లో అందరూ నిలదీస్తారు తులసిని.ఆవేశంగా ఉన్న మనిషితొ ఏం మాట్లాడలేము, అయినా సామ్రాట్ గారికి నా వల్ల నష్టం జరిగింది, దానికి నేను బాధపడుతున్నాను అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుతుంది ఇంట్లోవాళ్ళతో తులసి.రేపే వినాయక చవితి, పూజ చేద్దాము, నా మీద పడ్డ నిందలు దూరమవుతాయో, లేదో చూద్దాం అని ఇంట్లో వాళ్లకి సమాధానం చెబుతుంది.

ఒకవైపు లాస్య, నందు తులసి, సామ్రాట్ విషయంలో సంతోషపడతారు, సామ్రాట్ అలా చేసినందుకు.ఇప్పుడు సామ్రాట్ మన గ్రిప్ లో ఉన్నాడు, సామ్రాట్ చేత మన కంపెనీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవాలి అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.ఒకవైపు సామ్రాట్ హని పాప దగ్గరికి వెళ్లి, బ్రతిమలాడుతాడు, సారీ అమ్మా, నా దగ్గరికి రా అని, బాధపడుతూ అడుగుతాడు. అప్పుడు పాప ఏడు వద్దు నాన్నా, తులసి అంటీ గురించి అడిగితే, నీకెందుకు కోపమొచ్చింది నాన్నా అని అడుగుతుంది.ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకమ్మా అని అంటాడు. ఆంటీ ఊర్లో లేదు అని సమాధానం చెబుతాడు. ఇంతలో సామ్రాట్ వాళ్ల బాబాయ్ వచ్చి, మీ నాన్న ఎప్పుడూ అబద్ధం చెప్పడు కదా అమ్మ అని అంటే, పాపా చెప్పడు మా నాన్న గుడ్బాయ్, ఎప్పటికీ అబద్ధం చెప్పడు, అబద్ధం చెబితే, నీను నాన్న తొ ఎప్పుడూ మాట్లాడాను అని అంటోంది.ఈరోజు అబద్దం చెప్పావు,మళ్లీ అడిగితే ఎలా అని సామ్రాట్ వల్లభాబాయ్, సామ్రాట్తో అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.