Puspa 2 Movie Update : పుష్ప 2 కొత్త అప్ డేట్… ఓకే చెప్పిన రష్మిక…

Puspa 2 Movie Update : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. అంత బాగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప ది రైజ్ పేరుతో పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా నటీనటులకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అలాగే నిర్మాత లకు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దీనికి సీక్వెల్ గా పుష్ప 2 ఉంటుందని కన్ఫర్మ్ చేశారు సుకుమార్. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ పేరుతో సీక్వెల్ మూవీ రూపొందిస్తున్నారు. పుష్ప సినిమాకి భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

షూటింగ్ విషయంలో ఆలస్యమైన అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు సుకుమార్. పుష్ప 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప హీరోయిన్ రష్మిక మందన ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. తన బాలీవుడ్ మూవీ గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు, మూడు రోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అయినట్లు చెప్పింది రష్మిక. సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించినందట మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక ఈ సినిమాలో మరింత అట్రాక్ట్ ఫుల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట.

Advertisement

Puspa 2 Movie Update : పుష్ప 2 కొత్త అప్ డేట్… ఓకే చెప్పిన రష్మిక…

Pushpa 2 new update Rashmika said ok
Pushpa 2 new update Rashmika said ok

అలాగే పుష్పాలో దాక్షాయినిగా మెప్పించిన యాంకర్ అనసూయ మరింత పదునైన క్యారెక్టర్ తో ప్రేక్షకులకు ముందుకు రానుందని టాక్. పుష్ప రెండో భాగంలో అనసూయ రోల్ హైలెట్ కానుంది అని అంటున్నారు. పుష్ప 2 కోసం పుష్ప లో నటించిన నటి నటులతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా యాడ్ చేస్తున్నారట సుకుమార్. ఇదుకోసం ఫేమస్ నటులను ఎంపిక చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే పాపులర్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారట సుకుమార్. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement