Varun Lav : రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తుంది. తాజాగా మరో వార్త వీరి గురించి నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఇటలీలో నవంబర్ 1 పెళ్లి జరిగింది. అక్కడే మూడు రోజులపాటు ఉన్నారు. మెహందీ, హల్దీ, పెళ్లి అని అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఇక నవంబర్ 5న రిసెప్షన్ నిర్వహించారు ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వేడుక తర్వాత ఈ కొత్త జంట హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
అక్కడి నుంచి పంచుకునే ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు కూడా. అయితే అభిమానుల ఆసక్తికి బ్రేక్ వేశాడు వరుణ్ తేజ్. పెళ్లి అయిన కొత్తజంట సరదాగా ఉంటారు లేదా హనీమూన్ కి వెళ్తారు. కానీ వరుణ్ మాత్రం డిఫరెంట్ గా ఎయిర్పోర్టులో ఒక్కడే కనిపించాడు. హనీమూన్ కి వెళ్లాల్సిన వరుణ్ తేజ్ ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆరా తీస్తే ఈయన తన తదుపరి సినిమా ప్రొడక్షన్ వర్క్ ముంబైలో జరుగుతుందని అక్కడికి బయలుదేరారు. అయితే పెళ్లి జరిగిన వెంటనే ఇలా సినిమాలు, ప్రొడక్షన్ వర్క్ ఏంటి అని సరదాగా ఎంజాయ్ చేయాల్సింది వరుణ్ తేజ్ ఇలా చేశారు ఏంటి అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ విషయంలో లావణ్య చాలా ఫీల్ అయి ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. కానీ ఈ బ్యూటీ నే స్వయంగా కెరీర్ ఇంపార్టెంట్ అని హనీమూన్ కి తర్వాత అయినా వెళ్ళవచ్చు అని అర్థం చేసుకుంది. వరుణ్ ను అర్థం చేసుకొని భార్యగా లావణ్య మంచి మార్కులు వేసుకుంది. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి మట్కా, రెండవది ఆపరేషన్ వాలెంటైన్. రెండవ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్ తేజ్.