Driver Jamuna : ఐశ్వర్య రాజేష్ తను మొదట యాంకర్ గా చేసింది ఆ తర్వాత మలయాళమ్ సినిమా జోమెంట్ సువిషేశంగల్ దల్కన్, సల్మాన్ సరసన నటించినది. ఇలా కొన్ని సినిమాలు తర్వాత తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈమె కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రంలో తన నటనతో అందరికీ క్రికెట్ పై ఎంతో మక్కువ కలిగేలా చేసింది. తన నటనతో ఎంతో ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా విజయ్ దేవరకొండ తో చేసింది.
ఇలా కొన్ని సినిమాల తర్వాత ఇటీవల లో డ్రైవర్ జమునగా మన ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్ ఈమె ఈ సినిమాలో డ్రైవర్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో తన ఫ్యామిలీని పోషించడానికి ఎంతో ధైర్యంగా ఆ డ్రైవర్ వృత్తిని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ రూపంలో ఒక రైడ్ లాగా వెళ్లడం ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. ఈమెకు అనుకొని ప్రమాదాలు ఎదురవుతాయి. ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడింది. ఆ క్రమంలో ఈమెకి ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి? ఇవన్నీ తెలియాలి అంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.
Driver Jamuna : ఉత్కంఠ భరితంగా ఉన్న ఐశ్వర్య రాజేష్ “డ్రైవర్ జామున” ట్రైలర్

అయితే దానిలో ఐశ్వర్య రాజేష్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో నీకు కొన్ని సన్నివేశాలు చాలా ఉత్కంఠ భరతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఐశ్వర్య తను చేసిన పాత్ర డ్రైవర్ జమునగా తను కార్ స్టంట్ ప్రేక్షకులలో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ కు పి కిన్ స్లిన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జీబ్రాన్ అందించారు. ఈ చిత్రం త్వరలో తెలుగు కన్నడం మలయాళం, తమిళ్ పలు భాషలలో రిలీజ్ రానున్నది.