Pooja Hegde : పూజా హెగ్డే వరుస ఆఫర్లతో దూసుకుపోతూ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషల్లో బిజీగా ఉంది ఈ అమ్మడు. ఏదో ఈ మధ్యనే కే జి ఎఫ్ స్టార్ యశ్ తో చాన్స్ కొట్టిందని మనందరికీ తెలిసిన విషయమే. పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా అధిక సినిమాలు చేస్తూ తన అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ప్రతి సూపర్ స్టార్ తో చేసి ఈమె కూడా టాప్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసింది. దేశవ్యాప్తంగా పూజా హెగ్డే తన అందంతో నటనతో విపరీతంగా పెంచుకుంది. అందుకే ఈ భామకు ఆఫర్లన్నీ వరుస కడుతున్నాయి.
పూజా హెగ్డే ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోతో అవకాశాన్ని కొట్టేసింది. అయినా స్టార్ హీరో హీరోయిన్లు కలిసి చేస్తే ఫ్యాన్స్ కొచ్చె కిక్కే వేరు. ఈ అమ్మడు ఇప్పుడు సూపర్ స్టార్ అయినటువంటి సూర్య తో ఒక సినిమా చేస్తున్నట్లు తాజాగా ఒక సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం సూర్య బాలా డైరెక్షన్లో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా వెట్టిమారన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కంటే ముందే చిరుతై శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు సూర్య. ఈ సినిమాలో మన బుట్ట బొమ్మ అయినటువంటి పూజా హెగ్డే ను సంప్రదించినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. తెలుగులో అయితే టాప్ హీరోగా నడుస్తున్నాయి భామ తమిళ్ లో మాత్రం ఇంతవరకు ఒక సూపర్ హిట్ మూవీ కూడా లేదు.
Pooja Hegde : సూర్య సరసన రోమన్స్ కు రెడీ అవుతున్న అమ్మడు

పూజా హెగ్డే మిష్కిన్ ముగముడి అనే సినిమా ద్వారా కోలీవుడ్ కి పరిచయమైంది.ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆదరణ పొందక ఈ భామకి అక్కడ పెద్దగా గుర్తింపు పొందలేదు. ఈ మధ్యకాలంలో విజయ్ తలపథి చేసిన బీస్ట్ చిత్రం అది కూడా అంతంత మాత్రమే నిలవడం వల్ల కోలీవుడ్ లో ఈ భామ తమిళ్ లో లక్కు తక్కువగా ఉన్నట్లు అందరూ అనుకున్నారు. తాజాగా సూర్యతో అవకాశం దక్కించుకోవడంతో మళ్లీ కోలీవుడ్ లో తన ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. సూర్యతో చిరుతై శివ ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు టాకు వినిపిస్తుంది. ఇదే కనుక జరిగితే పూజా హెగ్డే కు అన్ని భాషల్లో తన పట్టు సాధించినట్లే అని భావిస్తున్నారు. అయితే సూర్యతో పూజా హెగ్డే సినిమా అవకాశం పై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.