Pooja Tips : తాంబూలంగా తమలపాకులు ఇవ్వడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?

Pooja Tips : మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం తమలపాకులకు చాలా విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరు తమలపాకులను శుభప్రదంగా కొలుస్తారు. మన ఆచారాల ప్రకారం తులసి ఆకు తర్వాత అంతా ప్రాముఖ్యత కలిగిన ఆకు ఈ తమలపాకు. దక్షిణ భారతదేశం లో పాత మైసూర్ ప్రాంతంలో శుభకార్యాలలో బంధువులకు తమలపాకులను ఇవ్వడం జరిగేది. ఈ పద్ధతి వల్ల ఇప్పుడు అతిధులకు తాంబూలాన్ని సమర్పించడం లా మారింది. అలాగే మన తెలుగు సాంప్రదాయాలలో పూజారులకు దక్షిణగా కూడా తమలపాకులను సమర్పిస్తారు.

ఈ తమలపాకులకు ప్రత్యేకమైన పురాణాల కథలు ఉన్నాయి. రామాయణం నుండి ఈ తమలపాకులను అతిధులకు శుభకార్యాలలో ఇవ్వడం మొదలైనది.రాముడు సందేశాన్ని సీతమ్మకు హనుమంతుడు తెలియజేస్తాడు, రాముని గురించి తెలుసుకొన్న సీతాదేవి చాలా సంతోషించి, తన ఆనందానికి గుర్తుగా ఏదైనా ఒక వస్తువు హనుమంతుడికి ఇవ్వాలని అనుకున్నది, ఆమెకు అందుబాటులో ఏమీ లేనందున అక్కడ వనంలో ఉన్న తమలపాకులను హనుమాన్ కి తను ఆనంద చిహ్నంగా ఇస్తుంది.

Pooja Tips : తాంబూలంగా తమలపాకులు ఇవ్వడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?

secret of making betel leaves in Tambulam
secret of making betel leaves in Tambulam

ఇలా అప్పటి నుండి ఇప్పటి వరకు బంధుమిత్రులకు ఆనంద సమయంలో తమలపాకును ఇవ్వడం సంప్రదాయంగా మారింది. అలాగే హనుమాన్ కు తమలపాకుల మాల సమర్పించే సంప్రదాయం అక్కడ నుంచే ప్రారంభమైనది. అలాగే ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు తమలపాకుని తీసుకుని వెళ్తే శుభం జరుగుతుంది అని నమ్మకం. కావున పెళ్ళిళ్ళలో కూడా తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.తమలపాకు మరియు వక్క ఇవి రెండు ఎప్పటికీ విడదీయలేవని కనుక పెళ్లి సమయంలో వీటిని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వధువు, వరుడుల బంధం కూడా ఇలా విడదీయలేనంతగా బలపడుతుందని తెలుగు వారి నమ్మకం.

అందుకే పెళ్లికి ముందు తాంబూలం తీసుకుంటే శుభప్రదంగా భావిస్తారు. హెల్త్ పరంగా కూడా తమలపాకు మంచి దివ్యఔషధంగా పనిచేస్తుంది. తమలపాకుని భోజనం తిన్న తర్వాత తీసుకుంటే గ్యాస్ , ఉబ్బసం, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వాయువు వల్ల వచ్చే సమస్యలను దూరం చేసే గుణాలు ఉన్నాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు తమలపాకుల రసం తలపై పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకులో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, అయోడిన్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తమలపాకు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.