Jabardasth : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. తన రియల్ లైఫ్ ఆటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ కాంబినేషన్లో వచ్చిన ‘ లైగర్ ‘ సినిమా విడుదలకు ముందు విజయ్ దేశమంతా తిరుగుతూ తన స్పీచ్ లతో అందరిని ఆకర్షించాడు. అదే సమయంలో కొన్ని వివాదాల్లోని చిక్కుకున్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీకు మా అయ్య తెలువదు, మా తాత తెల్వదు, ఎవడు తెల్వదు అయినా ట్రైలర్ కి ఈ రచ్చ ఏందిరా నాయన అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
అయితే భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. రౌడీ స్టార్ జడ్జిమెంట్ నే ప్రశ్నార్థకంగా మార్చింది. అంతేకాదు విజయ్ నెట్టింట ఎన్నడూ లేనంత నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. రిలీజ్ కు ముందు విజయ్ మాట్లాడిన మాటలకు సినిమా కంటెంట్కు ఏమాత్రం సంబంధం లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి సినిమాలు తీస్తే అయ్యా ఎవరో తెలవదు, తాత ఎవరో తెలవడం కాదు ఇండస్ట్రీలో మనం ఎవరో తెలియకుండా పోయే పరిస్థితి వస్తుందని కామెంట్స్ చేశారు.
Jabardasth :రౌడీ స్టార్ పై జబర్దస్త్ స్కిట్…

అయితే విజయ్ దేవరకొండపై కామెడీ షోలలో కూడా సెటైర్లు ట్రోల్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో రౌడీ స్టార్ ని ఇమిటేట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేశాడు. ఇందులో సూపర్ పాన్ ఇండియా స్టార్ గా ఏందిరా ఈ క్రేజ్ మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు, ఏంది క్రేజ్ అని భాస్కర్ డైలాగ్ చెప్పాడు. అయితే కొందరు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది విజయ్ దేవరకొండ పై సెటరికల్స్ కిట్ అని కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు ఒక హీరోని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. సినిమా హిట్ అయితే దాన్ని ఎవరు పట్టించుకునే వారు కాదేమో. కాకపోతే ఇక్కడ లైగర్ డిజాస్టర్ అవడంతో ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా అనుకుంటున్నారు.