Viral Video : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. ఎన్నో వీడియోలను అప్ లోడ్ చేసినా అన్నీ వైరల్ కావు. అన్ని వీడియోలలో మ్యాటర్ ఉండదు. కొన్ని వీడియోలను అస్సలు జనాలు చూడరు. కొన్ని వీడియోలను మాత్రం జనాలు బాగా చూస్తారు. దానికి కారణం ఆ వీడియోలలో ఉన్న సత్తానే దానికి కారణం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అన్ని వీడియోలు కూడా ఫన్నీగా ఉండవు. కానీ.. కొన్ని వీడియోలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి.
కొన్ని వీడియోలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యం వేస్తాయి. అసలు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని నోరెళ్లబెడతాం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో చోటు చేసుకుంది.
Viral Video : ఏమాత్రం జంకకుండా అలాగే కూర్చొని ఉన్న ఎద్దు
తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఏకంగా ఎద్దునే బైక్ మీద కట్టేసి వెనుక కూర్చోబెట్టుకొని వెళ్లాడు ఓ వ్యక్తి. ఎంతో బ్యాలెన్స్ గా బైక్ నడుపుతూ దాన్ని తీసుకెళ్లాడు. ఆ ఎద్దు కూడా ఏమాత్రం కదలకుండా అలాగే బైక్ మీద కూర్చుండిపోయింది. అసలు ఎద్దును పట్టుకోవాలంటేనే కొందరు భయపడతారు. అది ఎక్కడ పొడుస్తుందో అని టెన్షన్ పడతారు. కానీ.. ఆ ఎద్దు మాత్రం ఏమాత్రం భయపడకుండా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ హాయిగా బైక్ మీద కూర్చొంది. ఆ ఘటనను చూసి షాక్ అయిన ఇతర వాహనదారులు వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆవీడియోను చూసి… సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కూడా అప్ లోడ్ అవుతుంటాయా? ఆశ్చర్యంగా ఉంది. ఒక ఎద్దును అలా ఎలా బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఈ ప్రపంచం మీద జరుగుతున్న వింతలన్నీ మనకు తెలుస్తున్నాయి… అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.