NTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ ఆర్ఆర్ఆర్ ‘సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఈ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్ క్రేజీ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 25 న రిలీజ్ చేశారు. ఇప్పటికే దాదాపు 5 నెలలు అవుతుంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి కూడా ఆరు నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారు.
NTR30 : కొరటాలపై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్…
కొరటాల శివ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో నిరాశలో ఉన్నట్టే కనబడుతుంది. ఎన్టీఆర్ సినిమా కోసం ముందుగా అనుకున్న కథను కాదని మళ్లీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. కొరటాల బాగా టైం తీసుకోవడంతో పాటు కథలో మార్పులతో అంతా గజిబిజిగా ఉండడంతో ఎన్టీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ లేకుండా స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తే మహేష్ బ్రహ్మోత్సవం సినిమా లాగే ఫలితం ఉంటుందని కొరటాల ఇప్పటివరకు కథ రెడీ చేసుకోకుండా ఏం చేశాడన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోయింది.
సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. చూస్తుంటే సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఈ వంతునా అక్టోబర్లో కూడా సినిమా పట్టాలెక్కుతుందా అంటే డౌట్ గానే కనిపిస్తుంది. ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో కొరటాల బాగా డిస్టబెన్స్ లో ఉన్నట్టే కనబడుతుంది ఎన్టీఆర్ కూడా ఇన్ని రోజులు పాటు కొరటాలను నమ్మి ఖాళీగా ఉండడంతో కొరటాలపై అసహనంతోనే ఉన్నాడని అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఏర్పడిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని విషయంలో ఎవరికీ క్లారిటీ అయితే లేదు. దీనికి పూర్తి బాధ్యత కొరటాల దే అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.