Mahesh Babu : త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా గురించి షాకింగ్ న్యూస్…

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ సర్కారు వారి పాట ‘ సినిమా సక్సెస్ తర్వాత ఓ సినిమా చేయబోతున్నారని సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఒక పాత్రలో మహేష్ లుక్ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ ఎటువంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.ఈ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో మహేష్ బాబు పాత్రలు ఉంటాయని ప్రేక్షకులను అలరించేలా ఉండునున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించబోతుంది.

Mahesh Babu : త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా గురించి షాకింగ్ న్యూస్…

Shocking update about trivikram and Mahesh Babu
Shocking update about trivikram and Mahesh Babu

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా తర్వాత మూడవదిగా ఈ సినిమా రాబోతుంది. దీనివలన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలతో పాటు త్రివిక్రమ్ రచన, సహకారం అందించిన సినిమాలు సైతం ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని సమాచారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి ప్రాజెక్టులతో విజయాలను సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు. అలాగే త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వేగంగా సినిమాలను తెరకెక్కించడం కంటే క్వాలిటీ గా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు తో తీయబోయే సినిమా వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.