Karate Kalyani : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు కరాటే కళ్యాణి. వ్యాంప్ క్యారెక్టర్లతో కళ్యాణి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. రవితేజ నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి బాబి అంటూ ఓ సీన్లో నటించింది. ఆ సిన్ కు చాలా మంది ఫాన్స్ అయ్యారు. ఈ సినిమాతో పాటు కరాటే కళ్యాణి చాలా సినిమాల్లో అలాంటి క్యారెక్టర్స్ చేసింది. చత్రపతి, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల్లో కూడా నటించింది. నిజానికి కరాటే కళ్యాణి హరికథలు చెబుతూ ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా ఎదిగింది.
కరాటే కళ్యాణి కుటుంబం హరి కథలు చెప్పేది. అలా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కళ్యాణి కూడా హరికథలు చెప్పేది. ఆమె ప్రేమించినోడు, పెళ్లి చేసుకున్నోడు తనని చాలా మోసం చేశాడని ఎన్నోసార్లు బాధపడింది. కరాటే కళ్యాణి సామాజిక రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో బిజెపిలోకి చేరి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇక చెప్పేది నీతులు చేసేవి బూతు పాత్రలు అని విమర్శలు రావడంతో గత కొన్ని రోజులుగా వ్యాంప్ పాత్రలకు కరాటే కళ్యాణి గుడ్ బాయ్ చెప్పేసింది. ప్రస్తుతం కేవలం రాజకీయాల్లోనే కొనసాగుతుంది.
Karate Kalyani : పైట జారితేనే వాళ్లు నన్ను ఆదరించారు…
అంతేకాకుండా కొన్ని ఇంటర్వ్యూలలో తాను పూర్తిగా సినిమాలో నటించడం లేదని వ్యాఖ్యానించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ పాత్రల ద్వారా వచ్చినట్టు తెలిపింది. సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని తెలిపింది. ఇప్పటికీ తాను ఏ షో కి వెళ్లిన బాబి అంటూ పిలుస్తారని చెప్పింది. తనని గుర్తుపట్టినందుకు సంతోష పడాలో లేక వ్యాంప్ పాత్రల వల్ల వచ్చిన క్రేజ్ ఆ బాధతో బాధపడాలో అర్థం కాదని తన ఆవేదనను వ్యక్తం చేసింది