Keerthi Suresh : అందాల నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కీర్తి సురేష్ ఈమె మొదట బాలనాటిగా తెరకెక్కింది. ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేసింది. తర్వాత తను హీరోయిన్ గా చేసింది. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసిన సినిమా నేను శైలజ దాంట్లో తన నటన తో అభిమానుల గుండెల్లో కి దూసుకెళ్లింది. కీర్తి సురేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉన్నది ఈ అందాలభామ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది తను చాలా యాడ్స్ కూడా చేసింది. తను ప్రతి సినిమాలో తన పాత్రలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రతి సినిమాలో తను ఏడుస్తూ అభిమానులను కూడా ఏడిపిస్తుంది.
ఆమె మహానటిలో తన నటనతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది ఈ మహా నటి సినిమాలలో నటించడం కాదు జీవిచింది. తను నేను శైలజ సినిమాతో తెలుగు లో పెద్ద హిట్ ని కొట్టింది ఇలా చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అనుకోని పరిస్థితులలో తను వార్తల్లోకెక్కింది. దానికి కారణం ఆమె కుక్కపిల్ల నైక్ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అందరు హీరోయిన్లు ఇలా చేయడం ఫ్యాషన్ గా మారింది. అందరూ కుక్కపిల్లతో ఎన్నో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అభిమానులకు వాటిని పరిచయం చేయాలని ఆసక్తి తో ఉంటున్నారు.
Keerthi Suresh : కీర్తి సురేష్ తన కుక్క పిల్ల కోసం ప్రత్యేక విమానం

ఇలా హీరోయిన్లు కాదు హీరోలు కూడా కుక్క పిల్లలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. వాటిని వేదికలపై కూడా పరిచయం చేస్తున్నారు. అందరూ ఈ మధ్యన కుక్క పిల్లల తో ఫోటో షూట్ చేయడం ఫ్యాషన్ గా మారింది. ఈ మధ్యన రష్మిక మందన తన కుక్క పిల్ల కోసం ఫ్లైట్ టికెట్ కావాలి అని అడిగింది అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రష్మిక మందన ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పుడు కీర్తి సురేష్ తాజాగా ఆమె కుక్క పిల్ల కోసం తను ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ ఏర్పాటు చేయడమే గాక తన కుక్కపిల్ల మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతూ ఉన్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది