Tollywood : చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘ గాడ్ ఫాదర్ ‘. ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అభిమానుల ముందుకు రాబోతుంది. ఇది మలయాళ సినిమా ‘ లూసిఫర్ ‘ కు రీమేక్ గా తీస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిం సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి.
అయితే ఈ సినిమాను విజయదశమి సందర్భంగా విడుదల చేయనట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించారు. అయితే అదే సీజన్లో నాగార్జున సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు.కింగ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘాొస్ట్’ ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హై ఇంటెన్స్ యాక్షన్ గా అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.
Tollywood : విజయదశమి భరిలో పోటీ పడనున్న సీనియర్ స్టార్ హీరోలు…

అయితే ఈ సినిమాను దసరా కానుకగా 2022, అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. అయితే నాగార్జున నటించిన పాత్ర బ్రేకింగ్ సినిమా శివ కూడా 1989 లో ఇదే రోజున విడుదల అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ‘ ది ఘాొస్ట్ ‘ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దీంతో పండగ సీజన్లో రాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్ తో నాగార్జున ది గెస్ట్ సినిమా పోటీ పడాల్సి వస్తుంది. నాగార్జున చిరంజీవి గతంలో పదిసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఒకేరోజు ఇద్దరు సినిమాలు విడుదల కాలేదు కానీ ఓకే సీజన్లో 4 ,5 రోజులు మధ్యలో వచ్చేవి.
అలా చాలా సినిమాలు నాలుగైదు రోజులు గ్యాప్ తో రిలీజ్ అయ్యేవి. అయితే 2006 తర్వాత వీరిద్దరూ ఒకే సీజన్లో తమ చిత్రాలను విడుదల చేయలేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇద్దరూ మాట్లాడుకొని ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతూ వచ్చారు. కానీ ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నారు. ఈ ఆసక్తికరమైన యుద్ధం సినీ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. విజయదశమికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో సినిమా రిలీజ్ డేట్ మార్పులు జరుగుతాయేమో చూడాలి.