Vijayendra Prasad : చిక్కుల్లో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. ఆయన చెప్పిందే నిజమా? వీడియో వైరల్

Vijayendra Prasad : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించే చర్చ నడుస్తోంది. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ అందించాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల కొందరు ఆయన కొన్ని రోజుల కింద చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చర్చకు తీసుకొస్తున్నారు.

vijayendra prasad in controversy video viral
vijayendra prasad in controversy video viral

మహాత్మాగాంధీ వల్లనే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రధాన మంత్రి కాలేకపోయారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని కావాలని గాంధీ అనుకున్నారు. అలాగే జరిగింది. గాంధీ కోరుకున్న వ్యక్తే ప్రధాని అయ్యారు. కానీ.. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు జమ్మకశ్మీర్ రావణకాష్టంలా మారింది. దానికి కారణం అప్పుడు మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయమే అంటూ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Vijayendra Prasad : ప్రధానిగా నెహ్రూను గాంధీ సపోర్ట్ చేశారు

అప్పట్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 17 పీసీసీలను ఏర్పాటు చేశారని.. వాటికి ప్రెసిడెంట్స్ ను నియమించారని.. ఆ తర్వాత ఈ దేశానికి ఒక ప్రధాని ఉండాలని.. ప్రధానిగా ఎవరైతే బాగుంటుందో చీటీ మీద రాసి ఇవ్వండి అని 17 మంది ప్రెసిడెంట్స్ ను గాంధీ అడిగారు. కానీ.. అందులో ఎవ్వరూ నెహ్రూ పేరు రాయలేదు. 15 మంది పటేల్ పేరు రాశారు. ఒక చిట్టీలో ఏ పేరు రాయలేదు. ఒక చిట్టీలో కృపలానీ పేరు రాశారు. 17 మందిలో ఎవ్వరూ నెహ్రూను నామినేట్ చేయలేదు. కానీ.. నెహ్రూను ప్రధానిని చేయాలని.. 18 వ పీసీసీని ఏర్పాటు చేసి నెహ్రూను ప్రెసిడెంట్ గా చేశారు గాంధీ.

గాంధీకి ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉంటే.. పటేల్ ను ప్రధానిగా ఎన్నుకునే వారు కానీ.. పటేల్ ను పిలిచి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకోవడం కోసం మద్దతు ఇవ్వాలని తెలిపారు. అలాగే.. నేను బతికి ఉన్నంత వరకు నువ్వు ప్రధాని కాకూడదు అని గాంధీ.. పటేల్ దగ్గర మాట తీసుకున్నారు అని అప్పటి చరిత్ర గురించి విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎప్పుడైతే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిందో వెంటనే ఆయన గాంధీ గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.