Krithi Shetty : హీరోయిన్ కృతి శెట్టి ‘ ఉప్పెన ‘ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతుంది. అయితే ప్రస్తుతం కృతి చంద్రముఖి లాంటి పాత్ర చేయబోతుందంట. హీరోయిన్స్ హర్రర్ సినిమాలో నటిస్తే ఎక్కువ శాతం మంది చంద్రముఖిల నటించిందా, చంద్రముఖి పాత్రను డామినేట్ చేసిందా అన్నట్లుగానే చర్చించుకుంటారు. చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఆ స్థాయిలో నటించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. అందుకే ఫిల్మ్ మేకర్స్ అంతా తమ హర్రర్ సినిమాల్లో హీరోయిన్స్ ను ఆ స్థాయిలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే త్వరలో కృతి శెట్టి కూడా చంద్రముఖిలో మారిపోతుందంట.
Krithi Shetty : చంద్రముఖి పాత్ర చేయనున్న బేబమ్మ…
నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. హీరోయిన్ గా కృతి శెట్టి నటించబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగచైతన్యకు జోడిగా బేబమ్మ ఎంపిక చేయడం పూజ కార్యక్రమాలో ఆమె పాల్గొనడం జరిగింది. ఈ సినిమాలో కృతి శెట్టి ని హర్రర్ టచ్ ఉండే పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. దయ్యం పాత్రలో కృతి శెట్టిని చూపించడంతోపాటు కొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబోతున్నట్లుగా సమాచారం.

అయితే కృతి శెట్టి అప్పుడే అలాంటి ప్రయోగాత్మక పాత్రను చేయడం చాలా పెద్ద విషయం అని అంటున్నారు. తెలుగులో ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న కృతి శెట్టి ఇలాంటి సినిమా చేయడం పెద్ద విషయమే. ఇప్పుడిప్పుడే కెరియర్లో నిలదొక్కుకుంటున్న ఈ అమ్మడికి ఈ సమయంలో దయ్యం పాత్రలో నటించడం సాహస నిర్ణయం. డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఆమెపై ఎంత నమ్మకం ఉంటే ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసి ఉంటాడు అనేది మరికొందరి అభిప్రాయం. మొత్తానికి కృతి శెట్టి అప్పుడే చంద్రముఖి లాంటి పాత్ర చేయడం అనేది ఫ్యాన్స్ లో కూడా ఒక రకమైన ఆందోళన కలుగుతుంది.