Viral Video : మనుషులకే కాదండోయ్.. జంతువులకు, పక్షులకూ తెలివి ఉంటుంది. తమ జీవితంలో అవి కూడా అప్పుడప్పుడు తెలివి ఉపయోగిస్తాయి. తమ ప్రాణాలను రక్షించుకునే సమయంలో, తిండి కోసం తిరిగే సమయంలో జంతువులు, పక్షులు కాస్త తెలివితోనే ప్రవర్తిస్తుంటాయి. లేకపోతే వాటి మనుగడే కష్టం కదా. కానీ.. చాలామంది ఏమనుకుంటారంటే.. కేవలం మనుషులకే తెలివి ఉంటుందని, ఈ విశ్వంలోని జంతువులు, పక్షులకు తెలివి ఉండదని అంటుంటారు. కానీ.. అది తప్పు. మనుషుల కంటే కూడా జంతువులు, పక్షులకే ఎక్కువ తెలివి ఉంటుంది. కానీ..అవి మాట్లాడలేవు. మనం మాట్లాడగలం. అంతే తేడా. మనది అతి తెలివి. వాటిది తెలివి.

ఎందుకు వాటికి మనకంటే ఎక్కువ తెలివి ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇది బాతు, కుక్కకు సంబంధించిన వీడియో. కుక్కలు తెలుసు కదా.. అవి పక్షులను వేటాడి మరీ చంపేస్తాయి. కోళ్లు, బాతులు కనిపిస్తే అస్సలు వదలవు. ఓ కుక్కకు బాతు కనిపించింది. ఇక ఆగుతుందా? దాని వెంట పడింది. దీంతో బాతు.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. కానీ.. కుక్క కన్నా వేగంగా పరిగెత్తలేకపోయింది. దీంతో తనకు ఇక చావు తప్పదు అని అనుకుంది.
Viral Video : చావు కళ్లారా కనిపించడంతో బుర్రకు పదును పెట్టిన బాతు
తనకు ఇక చావు తథ్యం అని అనుకుంది బాతు. కానీ.. ఇంతలో దానికి ఒక ఐడియా తట్టింది. అంతే వెంటనే దాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. బాగా పరిగెత్తి పరిగెత్తి.. ఇక కుక్కకు ఆహారం అయిపోతా అని అనుకొని వెంటనే ఒకచోట కుప్పకూలిపోయింది. చనిపోయినట్టుగా చలనం లేకుండా అలాగే పడిపోయింది. దాని దగ్గరకు చేరుకున్న కుక్క.. అది కదిలితే దాన్ని తన నోటితో పట్టుకోవాలని చూస్తుంది. కానీ.. ఆ బాతు మాత్రం అస్సలు కదలదు. కాసేపు దాన్ని అలాగే చూస్తుంది. అయినా కూడా అది కదలకపోవడంతో ఇక అది చనిపోయిందేమో అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది కుక్క. కుక్క అక్కడి నుంచి వెళ్లిపోగానే వెంటనే బాతు లేచి పరుగో పరుగు. మళ్లీ అక్కడ కనిపించకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతుంది. దీంతో తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. బాతుకు మామూలు తెలివి లేదు కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
The Oscar goes to…. pic.twitter.com/Vad9hYzFsc
— Figen (@_TheFigen) September 11, 2022