Capsicum Health Benefits : క్యాప్సికాన్ని తినడానికి చాలామంది ఇష్టపడతారు. క్యాప్సికం ఎరుపు, ఆకుపచ్చ వర్ణాలను కలిగి ఉంటుంది. కానీ ఆకుపచ్చ కాప్సికం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. క్యాప్సికం తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. ఇది మిరప జాతికి చెందినది. ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మహిళలు క్యాప్సికంతో ఎన్నో నోరూరించే వంటలను వండుతారు. ప్రతి వంటకం స్పైసీగా మారటానికి క్యాప్సికమే ప్రధానం. క్యాప్సికాన్ని పిజ్జా దగ్గర నుంచి పరిటాల వరకు ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తారు.
అయితే ఈ గ్రీన్ కలర్ రుచికరమైన కూరగాయ తినడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మంది కి తెలియదు. దీనిపైన ఏర్పడ్డ తొక్క నుంచి దీని లోపల ఉండే గింజలు వరకు ప్రతిదీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్యాప్సికం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆకు పచ్చ క్యాప్సికం లో ప్రతిభాగం ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వీటి విత్తనాలలో అధిక సంఖ్యలో పోషకాలను కలిగి ఉంటాయి. క్యాప్సికం గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల సమస్యలను నయం చేస్తాయి. క్యాప్సికం తినటం వల్ల గుండె ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ప్లేవనాయిడ్స్, సైటో కెమికల్స్ ఉంటాయి.
Capsicum Health Benefits : క్యాప్సికం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకోసం.

అంతేకాకుండా ఈ కూరగాయ మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ,ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పలు ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. క్యాప్సికంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, షుగర్, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇటువంటి లక్షణాల వల్ల శరీరం పూర్తి పోషణను అందుకుంటుంది. ఫైబర్ క్యాప్సికంలో ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ కాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన చర్మానికి, జుట్టుకు సహాయపడుతుంది. వీటితో పాటు కళ్ళకు మేలు చేసే లూటీన్ కూడా దీనిలో ఇమిడి ఉంటుంది. క్యాప్సికంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీర బరువును తగ్గించుకోవాలనుకునేవారు క్యాప్సికాన్ని తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. కాబట్టి డైట్ దీన్ని చేర్చుకోవచ్చు.