RRR : అసలు భీమ్ ఎంట్రీ సీన్ ఇదా.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను రాజమౌళి ఎందుకు మార్చేసినట్టు?

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా? అసలు ఇలాంటి ప్రశ్న అడగడం వేస్ట్. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా చూడని వాళ్లు ఉండరు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వాళ్లే. థియేటర్ లో చూడని వాళ్లు ఓటీటీలో ఇప్పుడు చూసేస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి ఎక్కువ. సినిమాలో కొన్ని తీయలేని సీన్స్ ఉండటం వల్ల నిడివి ఎక్కువైపోయింది. అయినప్పటికీ డైరెక్టర్ రాజమౌళి కత్తెరకు పని చెప్పారట. చాలా సీన్లను ఫైనల్ కాపీ కంటే ముందు కట్ చేయించారట. అందులో ఒక సీన్.. భీమ్ ఇంట్రో సీన్. నిజానికి.. భీమ్ ఇంట్రో సీన్ సినిమాకే హైలెట్. జూనియర్ ఎన్టీఆర్ ఆ సీన్ కు ప్రాణం పోశారు. సినిమా ప్రారంభం అయ్యాక.. రామ్ చరణ్ ఎంట్రీ సీన్ తర్వాత వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్.

Advertisement
bheem intro shot uncut in rrr video viral
bheem intro shot uncut in rrr video viral

అది అడవుల్లో ఉంటుంది. ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి అందరికీ. అయితే.. ఆ సీన్ లో చాలా మార్పులు చేశాడట రాజమౌళి. అసలు సీన్ అది కాదట. భీమ్ ఇంట్రో సీన్ కంటే ముందు ఒక దువ్వెన(డ్రాగన్ ఫ్లయి) వచ్చి నీళ్లలో వాలుతుంది. దాన్ని ప్రతిబింబం నీళ్లలో కనిపిస్తుంది. అప్పుడే భీమ్ కూడా కూర్చొని ఉన్న ప్రతిబింబం కనిపిస్తుంది. అది వెళ్లిపోయాక అప్పుడు భీమ్ నిలబడతాడు. అతడి ప్రతిబింబం నుంచి కెమెరా రివర్స్ అయి భీమ్ ను వెనుక నుంచి చూపిస్తారు. అది అసలు ఇంట్రో.

Advertisement

RRR : థియేటర్ లో డ్రాగన్ ఫ్లయిని కట్ చేసిన రాజమౌళి

అప్పటికే సినిమా నిడివి ఎక్కువైపోయిందని, అలాగే భీమ్ మీద ఫోకస్ కాకుండా డ్రాగన్ ఫ్లయి మీద ఫోకస్ ఎక్కువవుతుందని అనుకొని ఆ సీన్ ను తీసేసి.. డైరెక్ట్ గా భీమ్ సీన్ నే పెట్టాడట రాజమౌళి. దానికి సంబంధించిన అన్ కట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ సీన్ చూసి.. గూస్ బంప్స్.. రాజమౌళి.. అన్ కట్ వర్షన్ సినిమాను విడుదల చేసినా జనాలు ఎగబడి మరీ చూస్తారు.. మళ్లీ అన్ కట్ సినిమా కూడా సంచలనాలు సృష్టిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ సీన్ ను మీరు కూడా చూసేయండి మరి.

Advertisement