Krithi shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా హిట్ తర్వాత తను వరుస షెడ్యూల్ తో బిజీగా ఉంటుంది. పూజా హెగ్డే, రష్మిక మందన తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా, ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న హీరోయిన్ కృతిశెట్టి. దర్శక నిర్మాతలకి తమ సినిమాలో కృతి ఉండాలని కోరుకుంటున్నారు. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే మూడు సినిమాలలో హీరోయిన్గా కమిట్ అయింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మరో నాలుగు సినిమాలను ఓకే చేసింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న కృతికి మొదటి మూడు సినిమాలు హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరాశపరిచాయి.
దీంతో కృతి క్రేజ్ తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ కొత్త సినిమాలు కమిట్ అవుతూ వస్తుంది. నిజానికి ఈ అమ్మడు మొదటి సినిమా ఛాన్స్ రావడానికి చాలా కష్టపడిందట. చాలా సినిమా ఆఫీసుల చుట్టూ కూడా తిరిగిందని టాక్. కృతి తల్లి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని దర్శకనిర్మాతలను రిక్వెస్ట్ చేసిందంట. కానీ ఇప్పుడు కృతి డేట్స్ కావాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయితే కృతి ఓ హీరోతో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో తెలియదు గానీ కొంచెం ఖాళీ సమయం దొరికిన అతనితో డిన్నర్లు, షికారులకి వెళుతుందంట.
Krithi shetty : కృతి శెట్టిని ఇంతలా వాడుకుంటున్నారా…
ఇది నమ్మడానికి కాస్త కష్టమే. ఎందుకంటే కృతి ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఉంది. నిద్రపోవడానికి టైం కూడా దొరకడం లేదు. అంతగా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంది అమ్మడు. ఈ రకంగానే కాస్త ఖాళీ దొరికితే తను కమిటైన దర్శక నిర్మాతలే తెగవాడుస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న కృతి పనిగట్టుకొని మళ్లీ డిన్నర్, షికారులకి తిరిగే సమయం ఉందా అనేది డౌటే. ఈ రకంగానే కృతిని బాగా వాడుతున్నారు. ఇక ఆ వాడకానికి ఎక్కడ టైం ఉందో అనేది ఊహించుకునే వారికే తెలియాలి. అందానికి టాలెంట్ కి క్రేజ్ తగ్గడం ఇప్పట్లో కష్టం. ఒక పాన్ ఇండియా సినిమా హిట్ పడితే అప్పుడు మన వాళ్ల వాడకం ఇంకో రేంజ్ లో ఉంటుంది.