Viral Video : స్మశానానికి పరిగెత్తుకొచ్చి అంత్యక్రియలు జరుపుతుండగా యజమానిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన దూడ

Viral Video : సాధారణంగా ఎవరైనా మనిషి చనిపోతే దగ్గరి బంధువులు, స్నేహితులు వెళ్లి అంత్యక్రియలు జరిపించి కన్నీటి వీడ్కోలు పలుకుతారు. కానీ.. ఆ మనిషి సాదుకునే కోళ్లు, కుక్కలు, ఆవులు, బర్రెలు అయితే వచ్చి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకవు కదా. కానీ.. జార్ణాండ్ లో మాత్రం ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. హజారీబాగ్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల చనిపోయాడు. దీంతో అతడికి తుది వీడ్కోలు పలికేందుకు జనాలు స్మశానానికి వచ్చారు. అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
calf cries at owner dead body video viral
calf cries at owner dead body video viral

ఇంతలో అతడు పెంచుకునే ఆవులకు పుట్టిన ఓ దూడ ఇంటి దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ స్మశానానికి చేరుకుంది. అక్కడ తన యజమాని ఎక్కడ ఉన్నాడా అని వెతకసాగింది. మృతదేహం వద్ద ఉన్న బంధువులు పక్కకు జరగడంతో తన యజమాని దగ్గరికి వెళ్లింది. అతడిని చూసి ముఖాన్ని నాకింది. కన్నీరు కార్చింది. అక్కడే కాసేపు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. అతడి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంది.

Advertisement

Viral Video : దూడ ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయిన మృతుడి కుటుంబ సభ్యులు

ఒక దూడ ఇలా వచ్చి అతడికి వీడ్కోలు పలకడం, అతడిని చూసి కన్నీరు పెట్టుకోవడం చూసి మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఆ దూడ ప్రవర్తనకు ఫిదా అయిపోయారు. కేవలం తనకు గడ్డి వేసి పెంచినందుకే ఆ యజమానిపై ఇంతలా అభిమానం పెంచుకుందా అని అందరూ అవాక్కయ్యారు. దూడ మృతుడి దగ్గరికి వెళ్లడం చూసి అక్కడ ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇది.. అసలైన ప్రేమ బంధం అంటే. ఆ దూడ చూడండి.. తన యజమానికి ఎలా కన్నీళ్లతో వీడ్కోలు పలికిందో.. జంతువులకు ఉన్న ప్రేమానురాగాలు మనుషుల్లో కరవయ్యాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement