Krithi Shetty : ఉప్పెన చిత్రం తో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో మేరిసింది. ఈమె అందానికి ఒక్క మూవీ తోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించికుంది. ఉప్పెన ఒక్క సినిమా తోనే అన్ని భాషలలో అవకాశాలను ఎగరిసుకొని పోతుంది ఈ బ్యూటీ. తెలుగు తమిళంలో వరుస ప్రాజెక్టుల తో బిజీగా గా మారిపోయింది ఈ సొట్టబుగ్గల బ్యూటీ. కృతి శెట్టి రామ్ పోతినేని జంటగా నటించిన మూవీ ద వారియర్. ఈ సినిమా ను ఎన్ లింగస్వామి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు తమిళ రెండు భాషలలో నిర్మిస్తున్నారు.
వరుస హిట్లతో ఉపూ ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింతగా స్పీడ్ పెంచుతూ సుధీర్ బాబు తో జతకడుతు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. అలగే నితిన్ హీరో గా నటిస్తున్న చిత్రం మాచెర్ల నియోజక వర్గం ఈ చిరం లో నితిన్ కు జంటగా నటిస్తుంది ఈ అమ్మడు. ఈ మూవీ కి యస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి వరుసగా తన ప్రాజెక్టులన్నీ చివరి దశకు వచ్చాయి. ఉప్పెన, బంగార్రాజు2, శ్యామ్ సింగరాయ్ , సినిమాలు హిట్ కావడం తో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి అని నెటిజన్లు అనుకుంటున్నారు. అంతే కాక స్టార్ హీరో సూర్య తో కూడా ఒక మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కు బాలా డైరెక్షన్ చేస్తున్నాడు.

ఇది ఎలా ఉండగా ఇప్పుడు ఈ తమిళం లో క్రేజీ హీరో అయిన అటువంటి ధనుష్ తో తిరుచిట్రాంబలం అనే సినిమాలో కృతిశెట్టి బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ముందుగా ప్రియాంక అరుణ్ మోహన్ ను అనుకున్నారు. ఆమె కాల్షీట్లు బిజీ వలన ఈ అవకాశం కృతిశెట్టి ను వరించింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎదిమైన వరుసగా బంపర్ ఆఫర్స్ తో అన్ని సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.