Ranapala plant : “రణపాల మొక్క” ఏంటి అనుకుంటున్నారా. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు కదా. ఈ మొక్కను మన ఇంట్లో పెంచుకుంటే చాలా ఉపయోగాలు వున్నాయి. ఈ మొక్క ఒకటి మన ఇంట్లో వుంటే ఒక్క వైద్యుడు మన ఇంట్లో వున్నట్లు లెక్క. అంత ప్రాముఖ్యత వుంటుంది మరి ఈ మొక్కకు. ఈ రణపాల మొక్కను బయట ఎక్కడో చూసే వుంటాం, కాని అది ఆ మొక్క అని తెలియదు. అందుకే, ఈ సారి నర్సరీకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఈ మొక్కను తెచ్చుకొని, మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి. ఈ మొక్కలో మంచి ఔషధ గుణాలు వున్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….
ఈ రణపాల ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్, యాంటీ వైరస్ గుణాలు కలిగి వుంటుంది. అందువలన మన కిడ్నీలోని రాళ్లను శుభ్రం చేస్తుంది. రణపాల మొక్క యొక్క ఆకులు,కాండం,వేరులు వందకి పైగా వ్యాధులను నయం చేస్తాయి. ఈ ఆకును రోజు పరిగడుపున నమలడం వలన ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ ఆకులు ఒళ్లు నొప్పులకు బాగా పనిచేస్తుంది. ఈ ఆకును మెత్తగా నూరి నొప్పి వున్న చోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ ఆకులను రసంగా చేసుకొని తాగితే మన శరీరంలో రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. అలాగే కొంతమంది నోటి నుంచి చెడు వాసన వస్తూ వుంటుంది.

అలాంటప్పుడు ఈ రణపాల ఆకును రోజు నమిలితే నోటి నుంచి దుర్వాసన రాదు.రణపాల ఆకులను మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ ఆకులు మన బాడీలోకి ఎటువంటి క్రిములు ప్రవేశించకుండా కాపాడుతాయి.అలాగే స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు ఈ ఆకు బాగా వుపయోగపడుతుంది. కొంతమందిలో రక్తప్రసరణ సరిగ్గా జరగక పక్షవాతం బారిన పడుతుంటారు. రణపాల ఆకు రసం రోజు తాగితే రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. ఈ ఆకులోని ప్రతి యొక్క భాగం వుపయోగపడుతుంది. రణపాల మొక్క మొత్తానికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. కాబట్టి దీనిని గృహంలో నాటడం ఉత్తమం