Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఈనెల తొమ్మిదవ తేదీన అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లోని మణికొండ లోని నాగబాబు నివాసంలో జరిగిన మీరిద్దరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఇక నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన ఓ ఫోటోను కాజాగా లావణ్య త్రిపాఠి ఫాన్స్ తో పంచుకుంది. తన ఎంగేజ్మెంట్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు చెబుతూ లావణ్య వరుణ్ తేజ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలను చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కాబోయే భార్యాభర్తలకు విషెస్ తెలియజేశారు.
అయితే ప్రస్తుతం ఒక ఫోటో వైరల్ గా మారింది. 2017లో మొదటిసారిగా వరుణ్ మరియు లావణ్య కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఇక అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడి ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది కానీ ఈ విషయాన్ని బయటకు మాత్రం తెలియజేయ లేదు. ఈ సందర్భంలోనే వీరిద్దరిపై పలు రకాల కథనాలు వచ్చినప్పటికీ వాటిపై కూడా స్పందించలేదు. సడన్ గా ఎంగేజ్మెంట్ తో ప్రేమ విషయాన్ని బయటకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిన వీరికి పెళ్లి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వీరి పెళ్లి ఇటలీలో జరగనున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వరుణ్ కి పెళ్లికి ముందే లావణ్య ఒక కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ఇక ఆ కండిషన్ ఏంటంటే లావణ్య కు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా నాట్యం చేయాలనేది ఆమె కోరికగా వరుణ్ కు తెలియజేశారు. అలాగే పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పి ప్రొడక్షన్ వైపు లావణ్య అడుగులు వేస్తారని తెలుస్తోంది. ఇక లావణ్య పెట్టిన షరతులకు వరుణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.