Viral News : ప్రేమ పెళ్లి చేసుకొని కట్నం కోసం 6 ఏళ్లుగా అబార్షన్…చివరికి ఏమైందంటే…

Viral News : ప్రస్తుత కాలంలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కుల మతాలు వేరైనా మనసులు కలవడం తో ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో కొందరు మాత్రమే వారి జీవితాలను సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి. మరికొందరైతే పడరాని కష్టాలు పడుతూ నరకం చూస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒక యువతికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కులం వేరైనా సరే మనసుపడి ఆమె భరత్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది. కానీ ఆ యువతి కాపురంలోకి కట్నం అనే భూతం వచ్చి పడింది. ఈ క్రమంలోనే గత 6 సంవత్సరాలుగా , యువతిని ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల చనిపోయింది…ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..

Advertisement

ప్రేమ పెళ్లి, కట్నం కోసం 6ఏళ్లుగా అబార్షన్.. చివరికి..

Advertisement

ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన శివకావ్య ( 26) వడ్ల భరత్ అనే అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. కులాలు వేరైనప్పటికీ ఒకరిని ఒకరు ఇష్టపడడంతో 6 ఏళ్ళ క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన తర్వాత మూడు నెలల వరకు శివకావ్యను భర్త భరత్ బాగానే చూస్తున్నారు. ఆ తర్వాత శివ కావ్య గర్భవతి అవ్వడంతో భరత్ మరియు వారి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని శివకావ్య తండ్రి చెప్పుకొచ్చాడు. అంతేకాక బాబు పుట్టిన తర్వాత ప్రతి ఏటా కావ్య గర్భం దాల్చడం భరత్ జీర్ణించుకోలేకపోయాడట.ఈ నేపథ్యంలోనే కావ్యకు తెలియకుండా అబార్షన్ మాత్రలు వేయించడం మొదట పెట్టడని ,వరకట్నం కోసం వేధిస్తున్నాడని కట్నం తెచ్చిన తర్వాత పిల్లల కనాలని అంటున్నాడని కూతురు కావ్య తనతో చెప్పినట్లుగా ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే బాధను తట్టుకోలేని కావ్య పలుమార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు , చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తండ్రి వెల్లడించారు . ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో భరత్ ని మందలించి తిరిగి కావ్య ను కాపురానికి పంపినట్లుగా తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే అబార్షన్ మాత్రలు వేయడం మానసిక వేదనకు గురి అవ్వడంతో గత కొన్ని నెలలుగా తన కూతురి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఈ నేపథ్యంలో హైదరాబాదులోని హాస్పిటల్స్ లో వైద్యం అందించామని తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కూతుర్ని భరత్ మానసికంగా వేధించడంతోపాటు తన తల్లి పై దాడి చేయడంతో ఆందోళనకు గురైన కావ్య హార్ట్ బీట్ పెరిగి గురువారం రాత్రి మృతి చెందినట్లుగా తండ్రి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో భరత్ మరియు వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్.ఐ నరేందర్ విచారణ చేపట్టారు.

Advertisement