లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!!

వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం జరిగిపోయింది. కొద్దిరోజులకిందట నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుక సినీ ప్రముఖులు, ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమాయణంలో ఉన్నప్పటికే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నేరుగా నిశ్చితార్ధం ప్రకటనతోనే వీరి లవ్ స్టొరీకి ప్రూఫ్ లభ్యమైంది.

Advertisement

మెగా వారసుడికి కాబోతున్న వధువు బ్యాక్ గ్రౌండ్ ఏంటి?అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. యూపీలోని అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించింది. డెహ్రాడూన్ లో పెరిగింది. తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి గవర్నమెంట్ టీచర్. ఆమెకు ఓ చెల్లులు, తమ్ముడు ఉన్నారు.

Advertisement

మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం అనంతరం ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ లో పట్టా పుచ్చుకుంది. అయితే , లావణ్య త్రిపాఠికి చిన్నప్పటి నుంచి గగ్లామర్ ఫీల్డ్ లోకి వెళ్లాలని మక్కువ. ఆ కారణంగానే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. 2012లో ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా లావణ్యకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత వచ్చిన భలే భలే మగాడివోయ్, సొగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు హిట్ అయ్యాయి.

Advertisement