ఈసారి బీజేపీ ఎన్నికల ఎజెండా పీవోకేనేనా..?

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి నెగ్గడం అంత తేలిక కాదని బీజేపీకి అర్థమైంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు విపక్షాల కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితం కాంగ్రెస్ లో సమరోత్సాహం నింపింది. దీంతో బీజేపీ ఏసారి ఏ ఎజెండాతో ఎన్నికల కదనరంగంలోకి దూకాలని ఆలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే పీవోకే ఎజెండాతో ఎన్నికలకు సన్నధం కావాలని బీజేపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీ లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా పీవోకే ఎజెండాతో సెంటిమెంట్ రగిల్చి బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. భారత్ లో ఉన్నది గతంలోని ప్రభుత్వం కాదని.. సరిహద్దును దాటి వచ్చి దాడి చేస్తామని పాకిస్థాన్ ను హెచ్చరించారు. ఇక పీవోకేపై ఆశలు వదిలేసుకోవాలని అక్కడి ప్రజలు భారత్ లో కావాలనుకుంటున్నారని చెప్పారు రాజ్ నాథ్.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేసిన రాజ్ నాథ్ సింగ్..ఖచ్చితంగా అక్కడి ప్రజల కోరిక నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉంటే…పీవోకే ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను చూస్తే ఎన్నికల నాటికే పీవోకే ను హస్తగతం చేసుకునే లక్ష్యంతో ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చడం ఖాయమన్న అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి.

Also Read : గేమ్ స్టార్ట్ నౌ…కేసీఆర్ లో మొదలైన భయం..?