Rahul Sipligunj – Rathika : రతిక నిజస్వరూపం బయటపెట్టిన రాహుల్….నన్ను మోసం చేసింది…!

Rahul Sipligunj – Rathika  : బిగ్ బాస్ హౌస్ లో అతి చేస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతు చిక్కని ప్రవర్తనత అపరిచితురాలుగా మారుతూ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో మొదటి స్థానంలో ఉంది మాత్రం రతిక అని చెప్పాలి. హౌస్ లోకి వచ్చిన మొదట్లో అమ్మాయి బాగుంది ఆట ఆడితే ఇంకా బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఇక తాను కూడా అదే చేసింది కానీ బిగ్ బాస్ గేమ్ కాకుండా హౌస్ మేట్స్ తో గేమ్ ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తించింది. ఇక ఇప్పుడేమో హౌస్ లో లవ్ ట్రాక్స్ నడుపుతూ తిరిగి వారిని వెన్నుపోటు పొడుస్తూ డబల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కన పెడితే…రతిక ఆమధ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది.  పదేపదే అతని గురించి ప్రస్తావిస్తూఅతను గుర్తు వస్తే తన మైండ్ పనిచేయడం లేదని చెప్పుకొచ్చింది.

Advertisement

rahul-exposed-rathikas-true-nature-she-cheated-me

Advertisement

అంతేకాక అతను సింగర్ అని కూడా హింట్ ఇచ్చింది. చివరికి మరి ఆ సింగర్ ఎవరో కాదు మన రాహుల్ సిప్లిగంజ్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక దీనిపై రాహుల్ కూడా స్పందించారు.  ఈ ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు…ఎప్పుడు కూడా పక్కన వారి ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారని రాహుల్ సిప్లిగంజ్ మండిపడ్డాడు. అలాగే తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల కావడంపై అనుమానం వ్యక్తం చేశాడు.  నాకు ఒక డౌట్….ఆరు సంవత్సరాల తర్వాత సడన్ గా ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయి..అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా. సమాధానం ఏంటో మీకే అర్థమవుతుందంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.

rahul-exposed-rathikas-true-nature-she-cheated-me

ఇక అక్కడ ఉన్నది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే వారి జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఎందుకంటే సక్సెస్ పొందడానికి ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు ..కానీ ఇలా ఫోటోలను బయటపెట్టి ఇబ్బంది పెట్టే ముందు ఒక క్షణం ఆలోచించాలి..ఎదుటి వ్యక్తి మరియు వారి కుటుంబ సభ్యులు దీనివలన ఎంత ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచించి ఉంటే బాగుండేదని రాహుల్ కామెంట్ చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో గతం వర్తమానం అని రెండు ఉంటాయి.అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఎవరిది తప్పు ,ఎవరిది ఒప్పో నిర్ధారించకండి.ఇది అర్థం చేసుకున్న వారికి థాంక్స్ , విషం చిమ్మాలి అనుకునే వారికి ఆల్ ది బెస్ట్ అంటూ రాహుల్ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం రాహుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement