Viral Video : పెళ్లంటే జీవితంలో ఒకేసారి జరిగే వేడుక. అందుకే తమ పెళ్లిని చాలా బాగా జరుపుకోవాలని.. పెళ్లి నాటి విషయాలు జీవితాంతం గుర్తుండాలని అందరూ అనుకుంటారు. అందుకే.. తమ పెళ్లి కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. పెళ్లి అంటే ఎవరికైనా ఒక మెమోరీని అందిస్తుంది. జీవితంలో మరిచిపోలేని ఒక వేడుక అది. అందుకే ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరి అయిన పెళ్లిని ప్రతి ఒక్కరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు.
కొందరికి తమ పెళ్లి ఇష్టం ఉండదు. కొందరు బలవంతంగా చేసుకుంటారు. మరికొందరు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటారు. అందుకే తమ పెళ్లి రోజున సంతోషంగా ఉండరు. ఓవైపు పెళ్లి జరుగుతుంటే కొందరు మాత్రం సంతోషంగా ఉండరు.
Viral Video : వరుడు తాళి కడుతుంటే ఆగలేకపోయిన వధువు
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. పెళ్లిలో ఇంత ఎగ్జయిట్ అవుతారా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఓ పెళ్లికూతురు ఎగ్జయిట్ అయి పెళ్లికొడుకుకు ఎలా ముద్దుపెట్టిందో చూడొచ్చు. పెళ్లికొడుకు తాళి కట్టడం స్టార్ట్ చేశాడో లేదో.. ఆ పెళ్లి కూతురు అస్సలు ఆగలేదు. ఏమాత్రం ఆగకుండా చాలా ఎగ్జయిట్ అయింది. వరుడు తాళి కడుతున్నంత సేపు తను ఏమాత్రం తన ఆనందాన్ని ఆపుకోలేకపోయింది. వరుడు తాళి కట్టడం పూర్తి కాగానే వెంటనే వరుడికి ముద్దు పెట్టి అతడి మీద తనకున్న ప్రేమను చాటుకుంది. వరుడికి వధువు ముద్దు పెట్టగానే పెళ్లికొచ్చిన అతిథులు అవాక్కయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. ఇది కదా.. అసలైన ప్రేమ అంటే. ఆ యువతి తన పెళ్లి కోసం ఎన్నిరోజులు వెయిట్ చేసిందో. చాలా సంతోషంగా ఉంది.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
என்னம்மா இப்படி பண்றிங்களேம்மா???? pic.twitter.com/GOKCkLOHT6
— செல்வம் அரசுப்பள்ளி ஆசிரியர்.. (@selvachidambara) September 13, 2022