Mahesh Babu : విక్రమ్ సినిమా పై మహేష్ బాబు ప్రశంశల జల్లు, నాకు అర్హత లేదు అంటూ కామెంట్స్ వైరల్.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు విక్రమ్ మూవీ గురించి సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే గత నెలలో మూడో తారీకు రిలీజ్ అయ్యి సక్సెస్ కావడమే కాకుండా జులై 8 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ సిద్ధమైంది విక్రమ్ మూవీ. ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమాపై ట్వీట్ చేయడం జరిగింది.

Advertisement

లెజెండరీ యాక్టర్ కమలహాసన్ గురించి నాకు చెప్పిన అర్హత లేదంటూ ఆయన నటన గురించి నేను ఎలా చెప్పగలను అంటూ, మీ ఫ్యాన్ గా నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అంటూ కమలహాసన్ ను ఆకాశానికి ఎత్తడం జరిగింది. విజయ్ సేతుపతి పర్ఫామెన్స్ గురించి ఫాహాధ్ ఫాజిల్ యాక్టింగ్ గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారిని పొగడ్తలతో ముంచేత్తాడు. ఈ విధంగా ట్వీట్ వైరల్ గా మారింది. మహేష్ బాబు ఇంత హుందాగా కమల్ హాసన్ గురించి చెప్తుండడం ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురిచేసింది. చాలాకాలం తర్వాత తన దగ్గర టాప్ ప్లేలిస్ట్ లో విక్రమ్ మూవీ ఉంది అంటూ అనిరుధ్‌ మ్యూజిక్ గురించి తను అందించిన లిరిక్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Advertisement
mahesh babu viral tweet about vikram movie
mahesh babu viral tweet about vikram movie

లోకేష్ కనకరాజు మూవీ మొదటి నుంచి చివరిదాకా తను చేసిన షూటింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందని చెప్పటం జరిగింది. యు మూవీ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం అని చెప్పాడు. ఈ సినిమాలో చేసిన విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి మరియు ఫాహాధ్ ఫాజిల్ నటన గురించి వివరిస్తూ వాళ్లు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టెంట వైరల్ గా మారి సెన్సేషన్ సృష్టించింది.

Advertisement