Health benefits : ఉసిరికాయలో పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, యాంటీయాక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.అంతేకాకుండా ఉసిరికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయలో సుమారుగా నీటిశాతం 80% ఉంటుంది. ఉసిరికాయలు కొవ్వు పదార్థాలు ఉండవు,కార్బో హైడ్రేట్ 4gm ఉంటాయి. ఉసిరికాయలో ఫైబర్ 9gm ఉంటుంది.క్యాలరీలు ఇరవై మూడు శాతం ఉంటాయి. వీటన్నింటికన్నా ఉసిరిలో ఎక్కువగా ఉండేది విటమిన్ సి,మన శరీరానికి విటమిన్ సి అనేది ఎంత మేలు చేసిందో మనందరికీ తెలుసు ఇన్ఫెక్షన్స్, బాడీ క్లీనింగ్, రొగనిరోధకశక్తి, గాయాలు త్వరగా మానడానికి వీటన్నిటికీ విటమిన్ C చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాంటి విటమిన్ C మనకి ఉసిరికాయలో పుష్కలంగా దొరుకుతుంది ఉసిరిని ప్రకృతిలో దొరికే ఒక ఔషధంగా అని కూడా అందరూ భావిస్తారు.శరీరంలో కొలాజిన్ బాగా హెల్దీగా ఉండటానికి ఉసిరికాయ చాలా ఉపయోగపడుతుంది కొలాజిన్ హెల్దీగా ఉండటం వలన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.కొలాజిన్ హెల్దీగా ఉండటం వలన జుట్టు ఊడకుండా ఉపయోగపడుతుంది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాక ఉసిరికాయ వలన బాటిల్లో ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గకుండా చూసుకుంటుంది,దీని వలన హార్ట్కి చాలామంచిది రక్తనాళాలు దెబ్బతినకుండా కూడా ఉపయోగపడుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించటానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది.
Health benefits : ఉసిరికాయను తీసుకోవడం వలన ఆరోగ్యానికి జరిగే మేలు.

ఆల్కాహాల్ తాగేవారికి లివర్ డ్యామేజ్ జరుగుతుంది అలాంటి వారికి ఉసిరికాయ పొడిని తాగించడం వలన లేదా ఉసిరికాయని తినిపించడం వల్ల లివర్ మొత్తం క్లీన్ అయ్యి ఆరోగ్యం కుదుటపడుతుంది.మనం తిన్న ఆహారం బాగా జీర్ణం అవడానికి కూడా ఉసిరి చాలా ఉపయోగపడుతుంది ఉసిరికాయను రోజూ తినడం వల్ల ఆకలి కూడా బాగా వేస్తుంది.ఉసిరికాయను ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని పొద్దున్నే లేవగానే ఒక ముక్క తినే కొంచెం మంచి నీరు త్రాగితే ఆరోజు నోరు మంచిగా దుర్వాసన రాకుండా ఉంటుంది.అంతే కాదండి చాలామందికి విటమిన్ సి లోపం వలన తెల్లజుట్టు రావడం, జుట్టు ఊడిపోవడం, నోట్లో పొక్కులు రావడం ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి అలాంటి వారందరికీ ఉసిరికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి .
ఇకపోతే చాలామంది ఉసిరికాయని తిని దానిలోని గింజని పడి వేస్తారు కానీ గింజ వలన కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి.ఉసిరికాయ ముక్కలతోపాటుగా గింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఇలా తీసుకున్న పొడిని తేనెతో కలిపి తినడం వలన బరువు కూడా తగ్గుతారు,అలాగే ఉసిరికాయ గింజల పొడిని పేస్ట్లా చేసుకుని నుదుటికి రాసుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది, అలాగే అప్పటికప్పుడు ఎక్కిళ్లు వస్తే చాలామంది మంచినీరు తాగుతారు మంచినీటితోపాటు ఉసిరికాయ గింజల పొడిని కూడా కలుపుకుని తాగడం వలన తక్షణ ఉపశమనం దొరుకుతుంది.చూశారు కదండీ ఉసిరికాయ వలన, ఉసిరికాయ గింజల వలన, మనకు ఎన్ని రకాలుగా ఉపయోగాలు జరుగుతున్నాయో.తప్పకుండా అందరూ ఈ చిట్కాలు పాటించాలి.