Tamannaah Bhatia : సౌత్ సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న మాల్ దీవుల్లో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్ లో భాగంగా ట్రిప్ కు వెళ్ళిన తమన్నా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది. సముద్రపు ఒడ్డున ప్రకృతి ఒడిలో తన అంద చందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి తమన్నా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తున్నాయి. అమ్మడి అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫోటోలలో మొదటి ఫోటోలలో తమన్నా బీచ్ లో పింక్ కలర్ బికినీ వేసుకొని నీటి అలలు కాళ్లకు తగిలేలా ఆకాశంలో ఇంద్రధనస్సును చూస్తూ పోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్లంతా తెల్లతోలు అందానికి ఫిదా అవుతున్నారు. అలాగే కళ్ళకు బ్లాక్ స్పెట్స్ ధరించి స్లీవ్ లెస్ టాప్ వేసుకొని అదిరిపోయే ఫోజులిచ్చింది. అయితే జైలర్ సినిమా ఐటెం సాంగ్ తర్వాత తమన్నా ఆకాశంలో తేలిపోతుంది అని చెప్పాలి.
ఇక మరికొన్ని ఫొటోస్ లో కాఫీ తాగుతూ జ్యూసులు తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేసిన అనతి కాలంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తమన్నా అందాలను చూసి కుర్రాళ్ళు పెట్టే కామెంట్స్ మామూలుగా లేవు. మొత్తం మీద మాల్దీవ్ వెకేషన్ ట్రిప్ ను తమన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. తమన్నా ఈ ఫోటోలను షేర్ చేస్తూ డిస్కవర్ సోవేవా ఎక్స్పీరియన్స్ సోవేవా అని క్యాప్షన్ పెట్టింది.
View this post on Instagram