Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగితే ఇక అంతే…తస్మాత్ జాగ్రత్త….

Green Tea : సాధారణంగా ప్రతిరోజు మనం టీ కాఫీలు తాగుతూ ఉంటాం. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచివి కాదని గ్రీన్ టీ కి మారితే మంచిదని ఎప్పటినుండో వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన కొవ్వు కరగడంతో పాటు ,చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కిడ్నీలో రాళ్లు….

if-those-who-have-these-problems-drink-green-tea-then-thats-it-tasmat-beware

Advertisement

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దానిని తీసుకోవడం వలన సమస్య మరింత పెరిగే అవకాశం ఉందట. అయితే గ్రీన్ టీలో ఉండే కాల్షియం మూత్రం లోకి చేరి రాళ్ళు గా ఏర్పడతాయి.

అసిడిటీ ఉన్నవారు….

if-those-who-have-these-problems-drink-green-tea-then-thats-it-tasmat-beware

ఆసిడిటి సమస్యలు ఉన్నవారు అలాగే గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు ఈ గ్రీన్ టీ కు దూరంగా ఉండటం మంచిది. మలబద్ధకం , ఎసిడిటీ ఉన్నవారు గ్రీన్ టీ తాగితే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. కనుక గ్రీన్ టీ కు దూరంగా ఉండటం మంచిది.

రక్తహీనత…..

if-those-who-have-these-problems-drink-green-tea-then-thats-it-tasmat-beware

ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. ఇక రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే గ్రీన్ టీ ఐరన్ ను గ్రహించనివ్వదు. గ్రీన్ టీ లోని సమ్మేళనాలు ఐరన్ పోషణను అడ్డుకుంటాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండడం మంచిది.

గమనిక : నిపుణుల అంచనాలు మరియు అధ్యయనాల ప్రకారం పైన వివరాలను పేర్కొనడం జరిగింది . యువతరం న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement