Windows 10 : విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పటిది కాదు.. మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన తొలి విండోస్ ఓఎస్ నుంచి ఇప్పుడు నడుస్తున్న విండోస్ 11 వరకు ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు ఒక చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల కంప్యూటర్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పని చేస్తున్నాయి. గత ఏడాదే సరికొత్త ఓఎస్ విండోస్ 11 ను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. కాకపోతే.. విండోస్ 11 ను ఉపయోగించాలంటే.. సిస్టమ్ లో కొన్ని ఫీచర్లు ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే.. విండోస్ 11 కు విండోస్ 10 యూజర్లు అప్ గ్రేడ్ చేసుకోలేరు. అందుకే.. విండోస్ 10 ఓఎస్ నే చాలామంది ఉపయోగిస్తున్నారు. విండోస్ 10 ఉపయోగించేవాళ్లకు కొన్ని సెట్టింగ్స్ డీఫాల్ట్ గా ఉంటాయి.
అవే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. అవును.. విండోస్ 10 ఓఎస్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ డీఫాల్ట్ గా ఉంటాయి. ఆ సెట్టింగ్స్ వల్ల చాలా సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. చాలామంది యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే.. అవసరం లేని నోటిఫికేషన్లు, యాడ్స్ వస్తుంటాయి. వాటితో పాటు ఇతర సెట్టింగ్స్ ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
Windows 10 : నోటిఫికేషన్స్ ను ఇలా డిసేబుల్ చేసుకోండి
చాలామందికి ఓఎస్ కు సంబంధించిన పలు నోటిఫికేషన్లు తరుచూ వస్తుంటాయి. అవి ఒక్కోసారి చిరాకు పుట్టిస్తాయి. వాటిని డిసేబుల్ చేసుకోవడానికి సిస్టమ్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్ అనే ఆప్షన్ లో నోటిఫికేషన్స్ ట్యాబ్ ను డిసేబుల్ చేసుకోండి. అలాగే.. ఆప్టిమైజ్ డ్ అప్ డేట్ డెలివరీ సిస్టమ్ అనే ఫీచర్ ద్వారా విండోస్ అప్ డేట్స్ పొందొచ్చు. దాని వల్ల.. కంప్యూటర్ ను వేరే వాళ్లకు షేర్ చేసేలా ఆ ఆప్షన్ సహకరిస్తుంది. అందుకే.. సెట్టింగ్స్ లో అప్ డేట్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఆప్షన్స్ లో.. అలో డౌన్ లోడ్ ఫ్రమ్ అధర్ పీసీ అనే ఆప్షన్ ను డిసేబుల్ చేసుకోవాలి.
విండోస్ ఓఎస్ కొన్ని రకాల యాడ్స్ ను కూడా ప్రమోట్ చేస్తుంటుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్ లో పర్సనలైజేషన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ లో షో సజెషన్స్ అకేషనల్లీ ఇన్ స్టార్ట్ అనే ఆప్షన్ ను డిసేబుల్ చేసుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను కూడా డిసేబుల్ చేసుకుంటే మంచిది.